వైరల్ వీడియో : చేప కడుపులో తాబేలు..ఎక్కడంటే..!?

March 6, 2021 at 3:11 pm

ఈ మధ్య కాలంలో కొన్ని వార్తలు వింటుంటే అవి నిజమేనా అన్న సందేహం వస్తుంది. ఇప్పుడు అలాంటి వింత వార్త ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. బ్రతికున్న చేప కడుపులో ఓ తాబేలు జీవనం చెయ్యటం శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ సంఘటన అమెరికాలోని ఫ్లోరిడాలో చోటు చేసుకుంది. పెద్ద నోరు ఉన్న చేప కడుపులో అసాధారణంగా ఓ తాబేలును గుర్తించిన బయోలజిస్టులు, అది సజీవంగానే ఉన్నట్టుగా కూడా నిర్దారించారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఫ్లోరిడాలోని FWC ఫిష్ అండ్ వైల్డ్ లైఫ్ రీసెర్చ్ సెంటర్ ఫేస్‌బుక్‌లో షేర్ చేసింది. ఈ అద్భుతమయిన ఇంకా ఆశ్చర్యం కలిగించే విషయాన్ని ఎలా గుర్తించామో కూడా వారు చెప్పుకొచ్చారు.ది ఫిష్‌ అండ్‌ వైల్డ్‌ లైఫ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ బయోలజిస్టులు కొద్ది రోజుల క్రితం ఓ చెరువులో లార్జ్‌మౌత్‌ బాష్‌ చేపను పట్టుకున్నారు.

తరువాత దాన్ని ల్యాబ్‌కు తీసుకెళ్లి పరిశోధనలు జరిపారు. ఈ క్రమంలోనే బయోలజిస్టులు దాని లింగ నిర్ధారణ పరీక్షలు చేయాలనుకున్నారు. ఆ టైంలోనే చేప కడుపులో ఏదో కదులుతున్నట్టుగా వారు గుర్తించి, చేప నోటిని తెరిచి చూడగా ఓ తాబేలు ఉన్నట్టుగా కనిపెట్టారు. ఆ తర్వాత దానిని చాలా జాగ్రత్తగా బయటకు తీశారు. ఇలాంటి సంఘటనలు సాధారణంగా జరగవని బయోలజిస్ట్‌లు చెప్పారు .అనంతరం ఆ తాబేలును సమీపంలోని నీటి ప్రవాహం వద్ద దానిని విడిచి పెట్టారు. ఇప్పుడు ఈ పోస్ట్ ఒక్క ఫేస్‌బుక్‌లోనే కాకుడా ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో కూడా బాగా వైరల్ అవుతుంది. దీనిపై నెటిజన్లు కూడా తమ శైలిలో స్పందిస్తున్నారు. ఆ తాబేలుకు ఈ భూమి మీద ఆయుష్షు ఇంకా ఉంది కాబ్బటి భర్తీకి బయట పడింది అంటూ కొంతంది నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

Field Notes from a Freshwater Biologist: Avoiding Turtle Disaster!

The sun rises over the grassy waters of the Florida…

Posted by FWC Fish and Wildlife Research Institute on Thursday, 4 March 2021

వైరల్ వీడియో : చేప కడుపులో తాబేలు..ఎక్కడంటే..!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts