ఈ వారంలో విడుదల అవ్వబోతున్న 14 సినిమాలు అవి ఇవే..!

March 4, 2021 at 3:42 pm

మాములుగా వారంలో రెండు లేక మూడు చిత్రాలు రిలీజ్ అవుతుంటాయి కానీ మార్చి మొదటి వారంలో ఏకంగా 14 మూవీలు విడుదల అవుతున్నాయి. కరోనా వైరస్ పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో పాటు సినిమాలన్నీ కూడా విడుదలకి లైన్ కడుతున్నాయి. ఏప్రిల్ నెలలో విక్టరీ వెంకటేష్ దృశ్యం 2, నాని టక్ జగదీష్, నాగార్జున వైల్డ్ డాగ్ వంటి భారీ చిత్రాలు రానున్నాయి.కాబట్టి చిన్న సినిమాలన్నీ కూడా మార్చి నెలలోనే రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. అయితే ఈ వారంలో 14 సినిమాలు రిలీజ్ కావడం విశేషం. అవేంటో ఇప్పుడు చూద్దాం. హాకీ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో సందీప్ కిషన్, లావణ్య త్రిపాటి తారాగణంతో రూపొందిన ఏ వన్ ఎక్స్ప్రెస్ర్ మార్చ్ 5వ తేదీన విడుదల కానున్నది. ఈ మూవీకి డెన్నిస్ జీవన్ దర్శకత్వం వహించారు.

రాజ్ తరుణ్ హీరోగా నటించిన సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ పవర్ ప్లే మూవీ కూడా అదే తేదీన రిలీజ్ కానుంది. మొగలి రేకులు సీరియల్ ఫేమ్ సాగర్ హీరోగా నటించిన రొమాంటిక్ డ్రామా షాది ముబారక్ చిత్రం కూడా మార్చి 5న రిలీజ్కా కానుంది. నితిన్ ప్రసన్న, ప్రీతి అశ్రాణి హీరో హీరోయిన్ గా నటించిన స్మాల్ టైం థ్రిల్లర్ A చిత్రం కూడా ఈ వారంలోనే రిలీజ్ కానుంది. తారకరత్న, సురేష్ కొండేటి కాంబోలో రూపొందిన దేవినేని మూవీ కూడా ఈ వారంలోనే రిలీజ్ కానుంది.
ప్లేబ్యాక్, తోటబావి, క్లైమాక్స్, శ్రీ పరంధామయ్య గారి శిష్యులు కథ వంటి సినిమాల ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ చిన్నపాటి సినిమాలన్నీ కూడా ఈ వారంలోనే విడుదల కావడం విశేషం. మార్చి 5న డబ్బింగ్ చిత్రాలైన గజకేసరి, విక్రమార్కుడు, ఖోస్ వాకింగ్, జుడాస్ & బ్లాక్ మెస్సీయ, రాయ, ది లాస్ట్ డ్రాగన్ కూడా రిలీజ్ అవుతున్నాయి. కేవలం ఒకే ఒక్క వారంలోనే 14 సినిమాలు విడుదలవుతున్న క్రమంలో ఏ చిత్రం హిట్ అవుతుందో ఏ మూవీకి కాసుల వసూళ్లు రాబట్టనున్నాయో వేచి చూడాలి.

ఈ వారంలో విడుదల అవ్వబోతున్న 14 సినిమాలు అవి ఇవే..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts