రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్..!?

March 4, 2021 at 2:09 pm

భారతీయ రైల్వే ప్రయాణికులకు ఒక న్యూస్ చెప్పింది. గత సంవత్సరం మార్చిలో కరోనా లాక్‌డౌన్ కారణంగా దేశ వ్యాప్తంగా రైల్వే సేవలు నిలిచిపోయిన విషయం అందరికి తెలిసిందే. లాక్‌డౌన్ ఆంక్షల్ని సడలించిన తర్వాత రైల్వే సేవలు దశల వారీగా మెల్లిగా అందుబాటులోకి వస్తున్నాయి. ప్రారంభంలో కొన్ని స్పెషల్ ట్రైన్స్ మాత్రమే ప్రకటించిన రైల్వే ఆ తర్వాత రైళ్ల సంఖ్యను పెంచుతూ వస్తోంది. మరోవైపు ప్యాసింజర్ రైళ్లను కూడా పునరుద్ధరిస్తోంది రైల్వే. యూటీఎస్ ఆన్ మొబైల్ యాప్‌లో టికెట్ బుకింగ్ తిరిగి ప్రారంభిస్తున్నట్టు కూడా రైల్వేస్ ప్రకటించింది. దీంతో పాటు ఇటీవల రైళ్లల్లో ఇ-కేటరింగ్ సర్వీస్‌ను కూడా మొదలు పెట్టేందుకు అనుమతిచ్చింది. ఐఆర్‌సీటీసీ ఇ-కేటరింగ్ సేవల్ని స్టార్ట్ చేసింది.

ఇప్పుడు రిటైరింగ్ రూమ్స్, రైల్ యాత్రి నివాస్, హోటళ్లను తెరిచేందుకు భారతీయ రైల్వే అనుమతి ఇచ్చింది. కానీ గత సంవత్సరం కరోనా లాక్‌ డౌన్ కారణంగా ఈ సేవలన్నీ నిలిచిపోయిన విషయం తెలిసిందే. అయితే స్థానిక పరిస్థితులు, ప్రభుత్వం జారీ చేసిన ప్రోటోకాల్స్‌ని దృష్టిలో పెట్టుకొని రైల్వే స్టేషన్లలోని రిటైరింగ్ రూమ్స్ తెరవడం పై నిర్ణయం తీసుకునే అధికారాలను జోనల్ రైల్వేస్‌కి అప్పగించింది భారతీయ రైల్వే. ప్రస్తుతం స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు తిరుగుతున్నాయి. ప్యాసింజర్ రైల్వే సేవలు కూడా దశల వారీగా అందుబాటులోకి వస్తున్నాయి. దీంతో రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ కూడా పెరుగుతుంది. రిటైరింగ్ రూమ్స్ త్వరగా తెరవాలన్న విజ్ఞప్తులు ప్రయాణికుల నుంచి వస్తున్నాయి.

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్..!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts