వాట్సాప్ నుంచి సరి కొత్త ఫీచర్..యూజర్ లకి ఇక పండగే..!!

March 5, 2021 at 2:44 pm

కరోనా వైరస్ లాక్ డౌన్ సమయంలో వీడియో కాల్స్, గ్రూప్ కాల్స్, వీడియో కాన్ఫరెన్స్ లాంటివి చాలా ఎక్కువయిపోయాయి. సరిగ్గా అదే టైములో జూమ్ యాప్, గూగుల్ మీట్ లాంటి వాటికి కూడా డిమాండ్ బాగా పెరిగిపోయింది. ఇప్పటికీ ఇంకా ఈ వీడియో కాల్స్‌కి డిమాండ్ ఉంది. ఇప్పుడు తాజాగా వాట్సప్ కూడా డెస్క్‌టాప్ ద్వారా వీడియో కాల్స్, గ్రూప్ కాల్స్ చేసుకునే సౌలభ్యం కల్పిస్తోంది. ఇందుకోసం కొత్త ఫీచర్ లాంఛ్ చేసింది వాట్సప్. డెస్క్‌టాప్‌లో వీడియో కాల్స్ ఫీచర్‌ని వాట్సప్ తీసుకొస్తుందన్న వార్త చాలా కాలంగా వినిపిస్తూ ఉంది. ఎట్టకేలకు ఈ ఫీచర్ వచ్చేసింది. కంప్యూటర్, ల్యాప్‌టాప్‌లో వాట్సప్ వెబ్ ఉపయోగించేవారికి ఈ ఫీచర్ బాగా పనికొస్తుంది. వాట్సప్ డెస్క్‌టాప్ ద్వారా చేసే వీడియో కాల్స్, వాయిస్ కాల్స్‌కి కూడా ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉంటుందని వాట్సప్ సంస్థ ప్రకటించింది.

డెస్క్‌టాప్‌లో వాట్సప్ కాలింగ్ ఫీచర్ వాడుకోవాలంటే విండోస్ 10 64-బిట్ వెర్షన్1903 లేదా అంతకన్నా లేటెస్ట్ ది ఉండాలి. మాక్ OS 10.13 లేదా అంతకన్నా లేటెస్ట్ వర్షన్ అయ్యి ఉండాలి. వీటితో పాటు యాక్టీవ్ ఇంటర్నెట్ కనెక్షన్ కూడా ఉండాలి. ఇంకా కంప్యూటర్‌తో పాటు ఫోన్‌కు ఇంటర్నెట్ కనెక్షన్ కూడా ఉండాలి. మొదట కంప్యూటర్‌లో, ఫోన్‌లో ఇంటర్నెట్ ఆన్ చేసి ఉంచాలి. వాయిస్ కాల్స్ చేయాలంటే కంప్యూటర్‌కు మైక్రోఫోన్, వీడియో కాల్స్ కోసం వెబ్‌క్యామ్ తప్పనిసరి ఉండాలి. ఆడియో ఔట్‌పుట్ డివైజ్ కూడా ఉండాలి. ఆ తర్వాత ఎవరిదైనా చాట్ ఓపెన్ చేసి వాయిస్ కాల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఇంక కాల్ కనెక్ట్ అవుతుంది. వీడియో కాల్ చేయాలంటే వీడియో కాల్ ఐకాన్ పైన క్లిక్ చేస్తే చాలు. మీ కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్ ఐదేళ్లు పాతదైనా వాట్సప్ ద్వారా వాయిస్ కాల్స్ వీడియో కాల్స్ చేసుకోవచ్చు. ఇందుకోసం వాట్సప్ సూచించిన విధంగా ఆ కాన్ఫిగరేషన్ ఉంటే సరిపోతుంది.

వాట్సాప్ నుంచి సరి కొత్త ఫీచర్..యూజర్ లకి ఇక పండగే..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts