భజ్జీ మూవీ టీజర్‌ రిలీజ్..విషెస్‌ చెప్పిన రైనా!!

March 2, 2021 at 2:42 pm

టీమిండియా మాజీ ఆటగాడు‌ హర్బజన్‌ సింగ్‌ హీరోగా నటిస్తున్న సినిమా ఫ్రెండ్‌ షిప్‌. ప్రస్తుతం ఈ చిత్రం చివరి షూటింగ్‌ షెడ్యూల్‌ను జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో భజ్జీ తన సినిమా టీజర్‌ను సోషల్ మీడియా మాధ్యమం అయిన ట్విటర్‌లో మంగళవారం నాడు రిలీజ్ చేసాడు. హిందీ, తెలుగు, తమిళ బాషల్లో రిలీజ్ అయిన ఈ టీజర్‌ యూట్యూబ్‌ లింక్‌లను షేర్‌ చేస్తూ, నా మూవీ ఫ్రెండ్‌షిప్ టీజర్‌ వచ్చేసింది. లింక్స్‌ ఇక్కడ ఉన్నాయి చూసి ఎంజాయ్‌ చేయండి గయ్స్‌ అంటూ హర్బజన్‌ సింగ్ ట్వీట్‌ చేశాడు.

ఫ్రెండ్‌షిప్ టీజర్‌ విడుదల చేసిన భజ్జీ. దీంతో క్రికెటర్‌ సురేష్‌ రైనా, మరికొందరు ఆటగాళ్లు, ఇంకా భజ్జి అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా భజ్జీకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా లోని సాంగ్, ఫస్ట్‌లుక్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది.

భజ్జీ మూవీ టీజర్‌ రిలీజ్..విషెస్‌ చెప్పిన రైనా!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts