`ఆర్ఆర్ఆర్‌` కోసం హాలీవుడ్ డైరెక్టర్‌ను రంగంలోకి దింపిన జ‌క్క‌న్న‌!

March 3, 2021 at 10:13 am

టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలు ద‌ర్శ‌క‌ధీరుడు తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్(రణం రౌద్రం రుధిరం)‌`. ఈ చిత్రంలో తెలంగాణ గోండు వీరుడు కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌, ఆంధ్ర ప్రాంతానికి చెందిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌ నటిస్తోన్న సంగతి తెలిసిందే.

అక్టోబర్‌ 13న విడుదల కానున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. అయితే తాజాగా ఈ చిత్రం కోసం హాలీవుడ్ డైరెక్ట‌ర్ నిక్‌ పావెల్ రంగంలోకి దింపారు జ‌క్క‌న్న‌. సెట్స్ పై తనదైన శైలిలో నిక్ పావెల్ సూచనలు ఇస్తున్న వీడియోను తాజాగా ఆర్ఆర్ఆర్ యూనిట్ సోష‌ల్ మీడియా ద్వారా పంచుకుంది.

`క్లైమాక్స్‌ గురించి ఎలాంటి అప్డేట్‌ రావడంలేదని భావిస్తున్న అభిమానుల కోసం ఒక అప్డేట్‌ ఇస్తున్నాం.. క్లైమాక్స్‌ కోసం పావెల్‌ వచ్చారు` అని కూడా యూనిట్ తెలిపిందే. ఇక నిక్ పావెల్ విష‌యానికి వ‌స్తే.. ఆయన కత్తియుద్ధంలో నిపుణుడు. అనేక యుద్ధ విద్యలను అధ్యయనం చేసిన అనుభవంతో హాలీవుడ్ సినిమాలకు యాక్షన్ డైరెక్టర్ గా సేవలు అందించాడు.

`ఆర్ఆర్ఆర్‌` కోసం హాలీవుడ్ డైరెక్టర్‌ను రంగంలోకి దింపిన జ‌క్క‌న్న‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts