
బ్రహ్మానందం.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ కమెడియన్గా తిరుగులేని ఇమేజ్ క్రియేట్ చేసుకున్న బ్రహ్మానందం అంటే ఎందరికో అభిమానం. బ్రహ్మీ అనే ముద్దుగా పిలుచుకునే ఈయన తెరపై కనిపిస్తే.. ప్రేక్షకులకు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంటే అనడంలో సందేహం లేదు.
అటువంటి బ్రహ్మానందంను హైదరాబాద్ పోలీసులు భలేగా వాడుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..జాబ్ పేరుతో ఆన్లైన్లో మోసపోవద్దు.. అనే కాన్సెప్ట్ తో సోషల్ మీడియాలో దుమ్ముదులుపుతున్న బ్రహ్మీ టాప్ మోస్ట్ మీమ్స్ అన్నింటిని కలిపి ఓ ఫన్నీ అవేర్నెస్ వీడియోను హైదరాబాద్ పోలీసులు రెడీ చేశారు.
అనంతరం ఈ వీడియోను పోలీసుల అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. హైదరాబాద్ పోలీసులు క్రియేటివిటీకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మరి ఆ వీడియోపై మీరు కూడా లుక్కేసేయండి.
Beware Of Fraud Jobs pic.twitter.com/45c11YmqcA
— హైదరాబాద్ సిటీ పోలీస్ Hyderabad City Police (@hydcitypolice) March 3, 2021