
ముంబై పోలీసులు తాజాగా బాలీవుడ్ ఫిలిం మేకర్స్ పై ఐటీ దాడులు నిర్వహించారు. ప్రముఖ సినీ నిర్మాతలు, దర్శకులు అనురాగ్ కశ్యప్, వికాస్ భల్, మధు మంతెనలతో పాటుగా ప్రముఖ నటి తాప్సీ తదితరుల ఆస్తుల పై ఇన్కమ్ టాక్స్ తనిఖీలు జరిగాయి. 2018లో నిలిచిపోయిన్ కశ్యప్ ఫాంటమ్ ఫిలింస్‌తో వారికి సంబంధం ఉందా లేదా అన్న విషయం పై ముంబై పోలీసులు ఈ తనిఖీలు చేస్తున్నారు. ఈ తనిఖీలు రిలియన్స్ ఎంటర్టైన్మెంట్ సీఈఓ, ఎక్సీడ్ సీఈఓ, క్వాన్ సీఈఓ తదితరుల ఆస్తుల పై కూడా జరిగింది.
అయితే బాలీవుడ్లో ప్రముఖ ఫిలిం మేకర్స్ అనురాగ్ కశ్యప్, విక్రమాధిత్య, మధు మంతెన కలిసి 2015లో ఫాంటమ్ ఫిలింస్‌ను మొదలు పెట్టారు. ఈ ప్రొడక్షన్ బ్యానర్ పై చాలా చిత్రాలు తెరకెక్కాయి. వాటిలో కొన్ని మంచి విజయాలు అందుకున్నాయి. మరి కొన్ని ప్లాప్ అయ్యాయి. ఆ తరువాత రిలియన్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ వారు ఇందులో యాభైశాతం స్టేక్ తీసుకున్నారు. ఆ తర్వాత ఈ ప్రొడక్షన్ కంపెనీ పై మాజీ ఉద్యోగి పెట్టిన లైంగిక వేధింపుల కేసును నమోదు చేశారు. అందులో ప్రధానంగా వికాస్ భల్ పేరును పోలీస్ వారు నమోదు చేశారు. ఆ తరువాత అదే కేసు కారణంగా మూత బడింది. ఇప్పుడు ఆ కేసుతో సంబంధం ఉన్న వారి ఆస్తుల పై ముంబై పోలీసులు తనిఖీలు చేస్తున్నారు.