నాగార్జునసాగర్ ఎన్నికల్లో బీజేపీ మద్దతుతో జనసేన పోటీ..?

March 27, 2021 at 12:12 pm

నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో జనసేన పార్టీ బీజేపీ మద్దతుతో పోటీ చేయబోతోందా అన్న విషయం పై ఇప్పుడు చర్చ సాగుతుంది. అన్ని ఉప ఎన్నికల స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ, నాగార్జున సాగర్‌లో మాత్రం అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. జనసేన పార్టీ నుండి పోటీ చేసే ఛాన్స్ ఎక్కువగా ఉన్నట్లు అందరు చెబుతున్నారు. నాగార్జున సాగర్‌లో పోటీ చేసేందుకు జనసేన అభ్యర్థిని ఎంపిక చేసింది రేపో ఎప్పుడో నామినేషన్ కూడా చెయ్యనున్నారు.

జనసేన పార్టీ ఎస్టీ అభ్యర్థినే నిలబెట్టబోతున్నట్లుగా వార్త బయటకు వచ్చింది. సాగర్ టికెట్ ను జనసేనకు వదిలేస్తే, రాజకీయంగా బీజేపీ ఆత్మహత్య చేసుకున్నట్లేనని కొంత మంది నేతలు అంటున్నారు. సాగర్‌ నియోజకవర్గం అంశం పై బీజేపీలో ఊపు తగ్గిపోవడం ఇప్పుడు అందర్నీ చాలా ఆశ్చర్యపరుస్తోంది. గత ఎన్నికల్లో పోటీ చేసి రెండు వేల ఓట్లు తెచ్చుకున్న నివేదితా రెడ్డి మళ్లీ బీజేపీ అభ్యర్థిగానే నామినేషన్ వేశారు.

నాగార్జునసాగర్ ఎన్నికల్లో బీజేపీ మద్దతుతో జనసేన పోటీ..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts