వైరల్ : 35కిలో మీటర్లు వెనక్కి పయనించిన రైలు..అసలు కారణం ఏమిటంటే..!?

March 18, 2021 at 1:14 pm

ఉత్త‌రాఖండ్‌లో ఒక రైలు సాంకేతిక లోపం కార‌ణంగా ఏకంగా 35 కిలోమీట‌ర్ల వెన‌క్కి న‌డిచింది. ట్రాక్‌ పైకి వ‌చ్చిన ప‌శువుల‌ను ఢీ కొట్ట‌కుండా ఉండాలని ట్రైన్ లోకోపైల‌ట్ స‌డెన్ బ్రేక్ వేశాడు. దీంతో ఇంజిన్‌లో సాంకేతిక స‌మ‌స్య వచ్చి రైలు వెన‌క్కి వెళ్ల‌డం ప్రారంభించింది. దేశ రాజ‌ధాని ఢిల్లీ నుంచి బ‌య‌లుదేరిన‌ పూర్ణ‌గిరి జ‌న‌శ‌తాబ్ది ఎక్స్‌ప్రెస్ ఇంజిన్‌లో ఈ సాంకేతిక స‌మ‌స్య వచ్చి రైలు 35 కిలోమీట‌ర్లు వెన‌క్కి న‌డిచి ఖాతిమా ద‌గ్గ‌ర నిలిచిపోయింది.

రైలు చాలా వేగంగా వెన‌క్కి వ‌స్తున్న వీడియో సోష‌ల్ మీడియాలో ఫుల్ వైర‌ల్గా అయింది. స‌డెన్ బ్రేకు వేయ‌డంతో ఇంజిన్ ‌పై లోకోపైల‌ట్ నియంత్ర‌ణ కోల్పోవ‌డంతో ఇలా జ‌రిగింది. ప్ర‌యాణికుల‌ను కిందికి దించి బ‌స్సుల ద్వారా త‌న‌క్‌పూర్‌కు పంపించారు. ఇలా జ‌ర‌గ‌డానికి ముఖ్య కార‌ణ‌మేంట‌న్న‌ది తెలుసుకోవ‌డానికి ఓ సాంకేతిక బృందం త‌న‌క్‌పూర్కి వెళ్లింది.

వైరల్ : 35కిలో మీటర్లు వెనక్కి పయనించిన రైలు..అసలు కారణం ఏమిటంటే..!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts