కొత్త కారు కొన్న‌ ఎన్టీఆర్‌.. ధ‌ర ఎంతంటే?

March 3, 2021 at 9:12 am

సాధార‌ణంగా సినీ సెల‌బ్రెటీలు త‌ర‌చూ కార్ల‌‌ను మారుస్తూనే ఉంటారు. తమ అభిరుచి, హోదా, ట్రెండ్‌కి తగ్గట్టు కార్లను కొనుగోలు చేస్తుంటారు. అలాంటి వారిలో టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఒక‌రు. ఏడాదికి ఒక‌సారి అయినా.. ఎన్టీఆర్‌కు కారు మారుస్తూ ఉంటారు.

అయితే కొంతకాలంగా కార్ మార్చని ఎన్టీఆర్.. ఇప్పుడు మాత్రం అదిరిపోయే కొత్త కార్ కొనుగోలు చేశారు. ఇటలీ నుంచి దీన్ని బుక్ చేశాడు. కారు పేరు లంబోర్ఘిని ఉరుస్. ఈ సూపర్‌ స్పోర్ట్స్‌ కారు ఖరీదు 5 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది.

అత్యంత విలాసవంతమైన ఈ కారు ఇటలీ నుంచి ఇండియాకు ప్రత్యేకంగా ఎన్టీఆర్ కోసం త్వరలోనే చేరుకుంటుంది. కాగా, ఇప్పటికే ఎన్టీఆర్ వద్ద ఖరీదైన కార్లు చాలానే ఉన్నాయి. ఇక ఇప్పుడు మరొకటి చేరబోతోంది.

కొత్త కారు కొన్న‌ ఎన్టీఆర్‌.. ధ‌ర ఎంతంటే?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts