క‌ర‌ణం బ‌ల‌రాంకు ఇంటా… బ‌య‌టా ద‌బిడి దిబిడేగా ?

March 7, 2021 at 12:28 pm

కొన్ని కొన్ని సంద‌ర్భాలు.. కొన్ని స‌మ‌యాలు చిత్రంగా అనిపిస్తుంటాయి. మ‌రీ ముఖ్యంగా రాజ‌కీయాల్లో కీల‌క స‌మ‌యంలో నేత‌ల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించే ఘ‌ట‌న‌లు కూడా జ‌రుగుతుంటాయి. ఇలాంటి ఘ‌ట‌నే ఒక‌టి ప్ర‌కాశం జిల్లా చీరాల‌లో చోటు చేసుకుంది. ప్ర‌స్తుతం చీరాల మునిసిప‌ల్ ఎన్నిక‌లు జ‌రుగుతున్న నేప‌థ్యం లో ఇక్క‌డ త‌న హ‌వాను సుస్థిరం చేసుకునేందుకు టీడీపీ జంపింగ్ ఎమ్మెల్యే క‌ర‌ణం బ‌ల‌రాం ప్ర‌య‌త్నిస్తున్నారు. టీడీపీ నుంచి వ‌స్తూనే ఆయ‌న అనేక మందిని త‌న వెంట తెచ్చుకున్నారు.. అంటే.. దాదాపు టీడీపీని డ‌మ్మీని చేశారు.

ఇక‌, వైసీపీ విష‌యానికి వ‌స్తే.. త‌న వారికే మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో టికెట్లు ఇప్పించుకున్నారు. ఇది ఒక ర‌కంగా వైసీపీలో స్థానికంగా ఆధిప‌త్య ధోర‌ణిని ప్ర‌ద‌ర్శించ‌డ‌మే. అయితే.. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. త‌న ఆధిప‌త్య ధోర‌ణిని ఎంత‌గా ముందుకు తీసుకువెళ్లాల‌ని అనుకున్నా.. ఇప్పుడు మాత్రం చిత్రంగా క‌ర‌ణానికి రెండు ప‌రిణామాలు సెగ పెడుతున్నాయి. ఒక‌టి.. పార్టీలో రెబెల్స్ క‌ర‌ణం వ‌ర్గానికి చెక్ పెట్టేందుకు పెద్ద ఎత్తున ప్ర‌చారం చేస్తున్నారు. `సేవ్ చీరాల` పేరుతో క‌ర‌ణానికి వ్య‌తిరేకంగా రెబెల్ వ‌ర్గం ప్ర‌చారం చేస్తుండ‌డం గ‌మ‌నార్హం.

ఇది క‌ర‌ణానికి ఒక‌వైపు సెగ పెడుతుండ‌గా.. మ‌రోవైపు క‌ర‌ణం కుమార్తెను అంటూ కోర్టులో కేసు వేసిన‌ క‌ర‌ణం అంబికా కృష్ణ స్వ‌యంగా క‌ర‌ణంకు వ్య‌తిరేకంగా ఎన్నిక‌ల వేళ చ‌క్రం తిప్పుతుండ‌డం.. ప్ర‌చారం చేస్తుండ‌డం క‌ర‌ణం వ‌ర్గాన్ని ఇబ్బందుల్లో ప‌డేసింది. సేవ్ చీరాల పేరుతో ఆమె చీరాల అంత‌టా భారీ ఎత్తున పోస్ట‌ర్ల‌తో ప్రచారం చేస్తున్నారు. ఇక‌, టీడీపీ నేత‌లు.. కొంద‌రు క‌ర‌ణానికి అనుకూలంగా ఉన్నామ‌ని చెబుతూనే.. మ‌రోవైపు.. మాత్రం యాంటీ ప్ర‌చారం చేస్తున్నారు. సోష‌ల్ మీడియాలో దుమ్మురేపుతున్నారు.

అటు మున్సిపాల్టీలో చీరాల వైసీపీ ఇన్‌చార్జ్ ఆమంచి కృష్ణ‌మోహ‌న్ వ‌ర్గం బ‌లంగా ఉంది. ఆ వ‌ర్గం ఏకంగా 29 వార్డుల్లో రెబ‌ల్ అభ్య‌ర్థుల‌ను బ‌రిలోకి దింపింది. ఇక్క‌డ రేపు ఫ‌లితాల్లో తేడా వ‌స్తే జ‌గ‌న్ ద‌గ్గ‌ర క‌ర‌ణంకు ప‌నైపోయిన‌ట్టే ? ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తున్న వారు క‌ర‌ణానికి ఇంటా బ‌య‌టా కూడా సెగ పుడుతోంద‌నే కామెంట్లు చేస్తున్నారు. మ‌రి ఈ ప‌రిణామం నుంచి ఆయ‌న ఎలా బ‌య‌ట ప‌డ‌తారో చూడాలి.

క‌ర‌ణం బ‌ల‌రాంకు ఇంటా… బ‌య‌టా ద‌బిడి దిబిడేగా ?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts