2024లో అద్దంకి టార్గెట్‌గా బ‌లరాం ప్లాన్ ?

March 5, 2021 at 12:31 pm

వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి చీరాల ఎమ్మెల్యేగా ఉన్న‌ క‌ర‌ణం బ‌ల‌రామ‌కృష్ణ‌మూర్తి ప్లాన్ ఏంటి? ఆయ‌న ఏవిధంగా ముందుకు సాగాల‌ని అనుకుంటున్నారు? మ‌రీ ముఖ్యంగా త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం అద్దంకిలో ఎలా వ్య‌వ‌హ‌రించాల‌ని అనుకుంటున్నారు ? అంటే.. ప‌క్కా వ్యూహంతోనే ముంద‌డుగు వేయాల‌ని అనుకుంటున్నారు! అని అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్ర‌స్తుతం ఆయ‌న వైసీపీలో ఉన్నారు. ఈ పార్టీకి అనుకూలంగా ఆయ‌న వ్య‌వ‌హ‌రించాలి. ఈ పార్టీని బ‌లోపేతం చేయాలి. అదే స‌మ‌యంలో ఈ పార్టీ గెలుపు కోసం ప‌నిచేయాలి. కానీ.. ఆయ‌న త‌న కోసం.. త‌న వ‌ర్గం కోసం.. ప‌నిచేస్తున్నార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది.

ప్ర‌ధానంగా.. తాను ఏ పార్టీలో ఉన్నా.. త‌న కేడ‌ర్ త‌న‌కు స‌హ‌క‌రించేలా అడుగులు వేస్తున్నారు. ఇటీవ‌ల జ‌రిగిన పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో క‌రణం.. ఇదే ఫార్ములాతో ముందుకు సాగారు. అద్దంకి నియోజ‌వ‌క‌ర్గంలో వైసీపీ గెలుపు గుర్రం ఎక్కింద‌ని చంక‌లు గుద్దుకుంటున్నా.. దీని వెనుక క‌ర‌ణం చ‌క్రం తిప్పారు. త‌న‌కు అనుకూలంగా మార్చుకున్నారు. త‌న మ‌ద్ద‌తు దారుల‌నే ఎక్కువ పంచాయ‌తీల్లో నిల‌బెట్టుకున్నారు. తాను ఎక్క‌డ ఉంటే.. అక్క‌డ మాట వినే నాయ‌కుల‌నే ఆయ‌న ఇక్క‌డ గెలిపించుకున్నారు. అంటే.. రేపు వ‌చ్చే ఎన్నిక‌ల్లో 2024లో తాను అద్దంకి నుంచి త‌ను కానీ.. త‌న కుమారుడు కానీ.. పోటీ చేస్తే.. తిరుగులేకుండా చేసుకున్నార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

అంతేకాదు.. రేపు ఎన్నిక‌ల స‌మ‌యంలో అధికార పార్టీ ఓడిపోతుంద‌నే సంకేతాలు వ‌స్తే.. వెంట‌నే పార్టీ మారిపోయేందుకు కూడా క‌ర‌ణం వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. అందుకు అనుగుణంగానే ఆయ‌న త‌న వ‌ర్గాన్ని డెవ‌ల‌ప్ చేసుకుంటున్నార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలోనే వైసీపీ కేడ‌ర్ కూడా ఆయ‌న‌ను ఓన్ చేసుకోలేక పోతోంది. ఏదైనా స‌మ‌స్య ఉన్నా.. స్థానికంగా ఉన్న వైసీపీ నాయ‌కులుకు చెబుతున్నారే త‌ప్ప‌.. క‌ర‌ణం వైపు క‌న్నెత్తి చూడ‌డం లేదు.

ఇక‌, క‌ర‌ణం కూడా టీడీపీ నుంచి వ‌చ్చి.. త‌న వెనుక ఉన్న‌వారికి ప్రాధాన్యం ఇస్తున్నారు. త‌న వ‌ర్గాన్ని అన్ని విధాలా కాపాడుకుంటున్నారు. సో.. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. క‌ర‌ణం రేపు అద్దంకిలో పోటీ చేయ‌క త‌ప్ప‌ద‌నే … అది కూడా ఏ పార్టీ నుంచి అయినా పోటీ చేయాల్సి రావ‌చ్చ‌నే అక్క‌డ త‌న వ‌ర్గాన్ని ఇప్ప‌టి నుంచే గ్రిప్‌లో పెట్టుకుంటున్నార‌న్న చ‌ర్చ‌లే వినిపిస్తున్నాయి.

2024లో అద్దంకి టార్గెట్‌గా బ‌లరాం ప్లాన్ ?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts