
టాలీవుడ్లో మంచి క్రేజ్ ఉన్న నటీమణులలో లావణ్య త్రిపాఠి కూడా ఒకరు. అర్జున్ సురవరం తరువాత మళ్ళీ ఏ1 ఎక్స్‌ప్రెస్ సినిమాతో ప్రేక్షకులని అలరించేందుకు రెడీ అవుతుంది లావణ్య. ఇందులో హాకే ప్లేయర్‌గా కనిపించి మెప్పించనుంది. మార్చి 5న రిలీజ్ కానున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గత రాత్రి ఘనంగా నిర్వహించగా, ఈ వేడుకకు రామ్ ముఖ్య అతిథిగా వచ్చారు. అయితే వేడుక చివరలో స్టేజ్ పైకి వచ్చిన లావణ్య త్రిపాఠి, సందీప్ కిషన్‌ను అన్నా అనేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.
స్టేజ్‌పైన మాట్లాడిన లావణ్య త్రిపాఠి, A1 ఎక్స్ ప్రెస్ నా మనసుకు బాగా నచ్చిన చిత్రం.
ఈ కథ వినగానే చాలా కొత్తగా అనిపించి, వెంటనే ఓకే చెప్పేశాను. ఈ మూవీ కోసం నేను హాకీ కూడా నేర్చుకున్నాను. కోవిడ్ టైములో చాలా కష్టాలు పడి చిత్రాన్ని పూర్తి చేశాము. సందీప్ అన్నా గురించి చెప్పాలంటే అంటూ నాలుక కురుచుకుంది. వెంటనే సందీప్ మీకు అన్నా, నాకు మంచి ఫ్రెండ్ అంటూ కవర్ చేసింది. లావణ్య మాటలతో అందరి ముఖాలలో నవ్వులు పూశాయి. ఈ చిత్రంలో నా పాత్ర పెర్ఫెక్ట్ గా రావడానికి సందీప్ చాలా సహకరించాడు. దర్శకుడు ,సంగీత దర్శకుడు ఈ సినిమాకి ప్రధానమైన బలంగా నిలిచారు. ఒక స్పోర్ట్స్ చిత్రానికి కావలసిన ఎనర్జీని హిప్ హాప్ తన రీ రికార్డింగ్ తో ఈ చిత్రానికి అందించారు. మీరంతా కూడా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలి. సాధారణంగా హీరో రామ్ ఎక్కడికీ రారు. అలాగే ఈ ఈవెంట్ కి కూడా రాఋ అని అనుకున్నాను. కానీ ఆయన రావడం నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది ఇంకా సంతోషాన్ని కూడా కలిగించింది అంటూ వయ్యారి మాటలతో అందరిని అలరించింది లావణ్య.