ఏప్రిల్ 1 నుంచి ఒంటిపూట బడులు….!?

March 22, 2021 at 5:39 pm
education minister

ఏపీలో కరోనా కేసులు పెరగడంతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఏప్రిల్‌ 1 నుంచి ఒంటి పూట బడులు ప్రారంభించనున్నట్లు విద్యా శాఖ మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. ఏప్రిల్‌ 1వ తేదీని నుంచి 1 నుంచి పదో తరగతి వ్యిద్యార్థులకు ఒక్కపూటే తరగతులు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో ఉదయం 7.45 నిమిషాలకు పాఠశాలలు ప్రారంభం అవనుండగా మధ్యాహ్నం 12.30 వరకు తరగతులు నిర్వహించనున్నారు. అనంతరం మధ్యాహ్న భోజనం ఉంటుంది.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పాఠశాలల నంచి విద్యార్థులు క్షేమంగా ఇళ్లకు చేరుకునేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు. మార్చిలోనే ఎండలు మండిపోతుండడం, కరోనా కేసులు కూడా బాగా పెరుగుతుండడంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇక విద్యార్థులకు కోవిడ్‌ పరీక్షలు నిర్వహణ, మాస్క్‌లు ధరించడం, శానిటైజర్ వినియోగం, భౌతిక దూరం పాటించేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని మంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఏప్రిల్ 1 నుంచి ఒంటిపూట బడులు….!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts