థ‌మ‌న్‌పై మండిప‌డుతున్న మ‌హేష్ ఫ్యాన్స్‌..ఎందుకంటే?

March 5, 2021 at 1:30 pm

టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో `స‌ర్కారు వాటి పాట‌` సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. మైత్రీ మూవీ మేక‌ర్స్‌, 14 రీల్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప‌తాకాల‌పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు.

ఇటీవ‌లె ఈ సినిమా షూటంగ్ ప్రారంభం కాగా.. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. బ్యాంకిగ్ రంగంలో జరిగే ఆర్థిక నేరాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా విష‌యంలో మ్యూజిక్ డైరెక్ట‌ర్ థ‌మ‌న్‌పై మ‌హేష్ ఫ్యాన్స్ మండిప‌డుతున్నారు.

ఇటీవ‌ల విడుద‌లైన సర్కారు వారి పాట మోషన్ పోస్టర్ కు థమన్ అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు. అయితే కన్నడలో చేస్తోన్న పునీత్ రాజ్ కుమార్ నటించిన యువరత్న సినిమాలో ఒక సాంగ్ కు కూడా దాదాపు అదే మ్యూజిక్ ఇచ్చాడు థమన్. ఈ కార‌ణంగానే థ‌మ‌న్‌పై మ‌హేష్ ఫ్యాన్స్ గుర్రుగా ఉన్న‌ట్టు టాక్ న‌డుస్తోంది.

థ‌మ‌న్‌పై మండిప‌డుతున్న మ‌హేష్ ఫ్యాన్స్‌..ఎందుకంటే?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts