మహేష్ బాబు కొత్త కార్‌వ్యాన్ మీరు చూసారా..!?

March 6, 2021 at 1:42 pm
mahesh babu

సినిమా స్టార్స్ ఎంత విలాసవంతమైన జీవితం గడుపుతుంటారో కొత్తగా చెప్పనక్కర్లేదు. మూవీ షూటింగ్స్ కోసం ఔట్‌డోర్‌కు వెళ్ళినప్పుడు కూడా వారికి అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉండేలా స్పెషల్గా కార్‌వ్యాన్‌ను ఏర్పాటు చేసుకుంటారు. మొన్న ఆ మధ్య స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రత్యేకంగా కార్ వ్యాన్‌ను తయారు చేయించుకున్నాడు. అది అందరిని విపరీతంగా ఆకట్టుకుంది. తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు కూడా అన్ని హంగులతో కార్‌వ్యాన్‌ను రెడీ చేయించుకున్నాడట.

ప్రస్తుతం మహేష్ బాబు కార్ వ్యాన్‌కు సంబంధించిన పిక్స్ నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. గత సంవత్సరం సరిలేరు నీకెవ్వరు మూవీతో ప్రేక్షకులని పలకరించిన మహేష్ ప్రస్తుతం పరశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట అనే సినిమా చేస్తున్నారు. ఇప్పటికే దుబాయ్‌లో కొన్ని షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలో మహేష్ సరసన రష్మిక కథానాయికగా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే.

మహేష్ బాబు కొత్త కార్‌వ్యాన్ మీరు చూసారా..!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts