
ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఇంధన ధరలతో పాటు, నిత్య అవసర సరుకులు, వంట గ్యాస్ ధరలు దీంతో సామాన్య ప్రజలకు చాలా ఇబ్బందికరంగా అయ్యింది. ఈ తరుణంలో పలు రాష్ట్రాలలో పెట్రోల్ ధర ఏకంగా 100 రూపాయలు పైగా ఉండడంతో సోషల్ మీడియాలో పెట్రోల్, డీజిల్ ధరల పై నెటిజన్స్ జోకులు వేస్తున్నారు. ఇక తాజాగా మరో వైపు వంట గ్యాస్ ధర 25 రూపాయలు సామాన్య ప్రజలకు కాస్త భారంగా మిగిలింది. ఇలా ఉండగా.. ఇటీవల కాలంలో కరూర్ జిల్లాలో తిరువల్లువర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుక్కురల్ పద్యాన్ని ఆలపించిన వారికి ఒక పెట్రోల్ పంపు ఓనర్ ఉచితంగా పెట్రోల్ వారికి అందించి సోషల్ మీడియాలో నిలిచిన సంగతి అందరికి తెలిసిందే.
తాజాగా ఒక కాంగ్రెస్ నాయకుడు క్రికెట్ టోర్నమెంట్ లో భాగంగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సొంతం చేసుకున్న వ్యక్తికి 5 లీటర్ల పెట్రోల్ ఉచితంగా అందజేశాడు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భూపాల్ లో కాంగ్రెస్ నాయకుడైన మనోజ్ శుక్లా క్రికెట్ టోర్నమెంట్ ను నిర్వహించాడు. ఆ మ్యాచ్ లో భాగంగా మాన్ అఫ్ ది మ్యాచ్ సొంతం చేసుకున్న సలావుద్దీన్ అబ్బాసీ అనే ఆటగాడికి ఉచితంగా 5 లీటర్ల పెట్రోల్ ను బహుమతిగా అందజేశారు. ప్రస్తుతం ఇందుకు సంబందించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో ఈ వార్త చక్కర్లు కొడుతోంది. ఇక రానున్న రోజులలో పెట్రోల్, డీజిల్ ధరలు ఇంకా ఎంత వరకు పెరుగుతాయి అని సామాన్య ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇంధన ధరల పెరుగుదలపై ప్రతిపక్ష పార్టీలు విమర్శల వర్షం కురిపిస్తున్నారు.