అరుదైన ఘనత సాధించిన మంచు లక్ష్మి…!?

March 1, 2021 at 1:39 pm

టాలీవుడ్ ప్రముఖ నటి మంచు లక్ష్మి పారా ఒలింపిక్స్‌లో పాల్గొనే దివ్యాంగుల కోసం 100 కి.మీ సైక్లింగ్ చేసారు. గత 20 రోజులుగా చేస్తున్న ఈ సైక్లింగ్ నిన్నటితో ముగిసింది. ఈ సందర్భంగా మంచు లక్ష్మి సైక్లింగ్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో తన అభిమానులతో పంచుకున్నారు. గతంలో 35 కిలో మీటర్ల సైక్లింగ్ చేసిన మంచు లక్ష్మి, తాజాగా 100 కిలో మీటర్లు సైక్లింగ్ కంప్లీట్ చేసారు. పారా స్పోర్ట్స్ అకాడ‌మీ, రిహాబ్ సెంట‌ర్‌లోని పారా అథ్లెట్ల కోసం నిధులు స‌మ‌కూర్చేందుకు మంచు లక్ష్మి ఇలాంటి కార్యానికి పూనుకున్నారు.

పారా సైక్లింగ్‌లో జాతీయంగా, అంత‌ర్జాతీయంగా పలు ప‌త‌కాల‌ను సాధించిన ఆదిత్య మెహ‌తా ఆధ్వ‌ర్యంలో ఈ ఫౌండేష‌న్ న‌డుస్తుంది. ఈ ఫౌండేష‌న్‌కు గత ఆరేళ్లుగా సేవ‌లు అందిస్తోన్న మంచు ల‌క్ష్మి, నిధుల స‌మీక‌ర‌ణ‌లో ఆదిత్య మెహ‌తాకు ఈ విధంగా సాయ‌ప‌డ్డారు.

అరుదైన ఘనత సాధించిన మంచు లక్ష్మి…!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts