
మంచు మనోజ్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనయుడిగా చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టిన మనోజ్.. తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. అయితే కొంత కాలంగా సక్సెస్ ముఖమే చూడలేదు మనోజ్. దీంతో కెరీర్ పరంగా స్ట్రగుల్ అవుతున్నాడు. అదే సమయంలో పర్సనల్ లైఫ్‌లో స్ట్రగుల్స్ ఎదుర్కొంటున్నారు.
ప్రణతి రెడ్డి 2015 ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కానీ, వీరి వివాహ బంధం ఎక్కువ కాలం నిలవలేదు. ఇటీవలె మనోజ్.. భార్య నుంచి విడాకులు తీసుకుని మళ్లీ సినిమాలపై దృష్టి సారించాడు. అయితే ఇలాంటి సమయంలో మనోజ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. అమ్మాయి మోహన్ బాబు బంధువుల కుటుంబానికి చెందినదేనంటూ వార్తలు వచ్చాయి.
ఈ వార్తలపై తాజాగా మనోజ్ క్లారిటీ ఇచ్చాడు. పెళ్లి తేదీ, ముహూర్త ఘడియలు కూడా మీరే చెప్పేయండి అంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తద్వారా తన పెళ్లిపై వస్తున్న వార్తల్లో నిజంలేదని చెప్పకనే చెప్పారు. మరి ఇప్పటికైనా మనోజ్ రెండో పెళ్లిపై వస్తున్న వార్తలు ఆగుతాయో లేదో చూడాలి. కాగా, ప్రస్తుతం ‘అహం బ్రహ్మస్మి’తో వస్తున్నాడు. ఈ చిత్రంతో శ్రీకాంత్ రెడ్డి అనే కొత్త దర్శకుడు టాలీవుడ్‌కు పరిచయం అవుతున్నాడు.