వెండితెరపై ‘వీరయ్య’గా చిరు..!?

చాలా గ్యాప్ తర్వాత మరోసారి హీరోగా జనం ముందుకు వచ్చిన చిరంజీవి ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఖైదీ నంబర్ 150 మూవీతో రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఆ తరువాత చేసిన సైరా చిత్రానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికీ చాలా ఆలోచించారు. అలానే ఆచార్యకు సై అనడానికీ ఎంతో అలోచించి ఒప్పుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రం నిర్ణయాల చకచకా తీసుకుంటున్నారు. తాజాగా డైరెక్టర్ బాబీ రెడీ చేస్తున్న స్ట్రయిట్ కథకూ చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.

ఈ చిత్రం కోసం వీరయ్య అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారట. ఇందులో చిరంజీవి పాత్ర పేరు వీరయ్య అని తెలుస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం అటు యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్ తో సాగుతుందని అంతృన్నారు. పవర్ సినిమాతో డైరెక్టర్ గా మారిన రచయిత కె.ఎస్. రవీంద్ర ఆ తర్వాత సర్దార్ గబ్బర్ సింగ్, జై లవకుశ, వెంకీ మామ వంటి చిత్రాలను రూపొందించాడు. మరి మెగా స్టార్ ను వీరయ్యగా వెండితెర పై ఏ రేంజ్ లో చూపనున్నాడో చూడాలి.