ఎడారిలో ఎంజాయ్ చేస్తున్న ఈ టాలీవుడ్ బ్యూటీ ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

March 6, 2021 at 4:00 pm

పైన క‌నిపిస్తున్న చిత్రం చూసే ఉంటారు. ఓవైపు ఎండ‌లు మండిపోతుంటే.. ఏకంగా ఎడారిలో ఫుల్‌గా చ‌క్క‌ర్లు కొడుతూ ఎంజాయ్ చేస్తోంది ఓ టాలీవుడ్ హీరోయిన్‌. ఇంత‌కీ ఆ హీరోయిన్ ఎవ‌రో గుర్తుప‌ట్టారు. ముఖం క‌నిపించ‌కుండా స్కాఫ్ క‌ట్టుకుంది కాబ‌ట్టి.. కాస్త చెప్ప‌డం క‌ష్ట‌మే. అందుకే మేమే రివిల్ చేస్తున్నాం.. ఆమె మెహ్రీన్.

నాని హీరోగా తెర‌కెక్కిన ` కృష్ణ గాడి వీర ప్రేమా గాధ` సినిమాతో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అడుగు పెట్టిన మెహ్రీన్‌.. త‌క్కువ స‌మ‌యంలో ఫుల్ క్రేజ్ సంపాధించుకుంది. ఈమె ఖాతాలో మహానుభావుడు, రాజా ది గ్రేట్, ఎంత మంచివాడవురా!, అశ్వథ్థామ ఇలా బాగానే హిట్లు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ దుబాయ్ ఎడారిలో ఎంజాయ్ చేస్తోంది.

Mehreen Pirzada Awesome Stills | Tupaki English

ఇందుకు సంబంధించిన ఫొటోలును ఆమె సోష‌ల్ మీడియా వేదిక‌గా అభిమానుల‌తో పంచుకోవ‌డంతో.. అవి కాస్త వైర‌ల్‌గా మారాయి. ఇక ఇదిలా ఉంటే.. మెహ్రీన్ త్వ‌ర‌లోనే పెళ్లి పీట‌లెక్క‌బోతున్న విష‌యం తెలిసిందే. హర్యానా మాజీ ముఖ్యమంత్రి దివంగత భజన్ లాల్ మనవడు, ఆదంపూర్ ఎమ్మెల్యే కుల్దీప్ బిష్నోయి కుమారుడు భవ్య బిష్నోయిని త్వ‌ర‌లోనే మెహ్రీన్ పెళ్లాడ‌బోతోంది.

Mehreen Pirzada Awesome Stills - Photogallery - Page 2

Mehreen Pirzada clarifies about interrogation by US immigration officials  in the Tollywood casting couch case - Pinkvilla - News

ఎడారిలో ఎంజాయ్ చేస్తున్న ఈ టాలీవుడ్ బ్యూటీ ఎవ‌రో గుర్తుప‌ట్టారా?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts