మూవీ రిలీజ్ కాకుండానే..జాతీయ అవార్డ్..!!

March 23, 2021 at 11:41 am

ప్ర‌తి సంవత్సరం లాగానే ఈ ఏడాది కూడా కేంద్ర ప్ర‌భుత్వం జాతీయ చ‌ల‌న చిత్ర అవార్డుల‌ను ప్ర‌క‌టించిన సంగతి తెలిసిందే. వీటిలో తెలుగు‌, త‌మిళం, మ‌ల‌యాళ భాష‌ల‌కు చెందిన ప‌లు చిత్రాలు తమ స‌త్తా చాటాయి. తెలుగు సినిమాకు నాలుగు అవార్డులు ద‌క్క‌గా, ఇందులో బెస్ట్‌ పాపులర్‌ ఫిల్మ్‌గా ప్రిన్స్ మహేశ్‌ బాబు నటించిన మహర్షి మూవీ ఎంపికైంది. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నాని నటించిన జెర్సీ మూవీకిఅవార్డ్ ద‌క్కింది. ఇక మహర్షి చిత్రానికి నృత్యాలు సమకూర్చిన రాజు సుందరం ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా, జెర్సీ మూవీకి ఎడిటింగ్‌ చేసిన నవీన్‌ నూలి ఉత్తమ ఎడిటర్‌గా జాతీయ అవార్డులకు ఎంపిక అయ్యారు.

ఇకపోతే మ‌ల‌యాళ ఇండ‌స్ట్రీకి సంబంధించి మోహన్‌లాల్‌ నటించిన మరక్కార్‌ మళయాళ సినిమాకి గాను ఉత్తమ ఫీచర్‌ ఫిల్మ్‌, స్పెషల్‌ ఎఫెక్ట్స్, కాస్ట్యూమ్స్ కేటగిరీల్లో అవార్డు దక్కింది. ఈ చిత్రం గ‌త ఏడాది మార్చి 26న రిలీజ్ అవ్వాల్సి ఉంది కానీ క‌రోనా వ‌ల‌న వాయిదా ప‌డింది. ఇప్పుడు మే 19,2021న ఆ చిత్రం రిలీజ్ చేయ‌నున్నారు. అయితే గ‌త సంవత్సరమే ఈ చిత్రం సెన్సార్‌కు వెళ్లి వారి నుండి క్లియ‌రెన్స్ రావ‌డంతో 2020లో వ‌చ్చిన చిత్రంగా జ్యూరీ ప‌రిగ‌ణించి అవార్డుల‌ని ప్ర‌క‌టించంది.ఈ విష‌యం తెలిసి ఇండ‌స్ట్రీకి చెందిన చాలా మంది ఆశ్చ‌ర్య పోతున్నారు.

మూవీ రిలీజ్ కాకుండానే..జాతీయ అవార్డ్..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts