వైర‌ల్‌ అవుతున్న నాగార్జున‌ స్ట‌న్నింగ్ పిక్..!!

March 2, 2021 at 2:08 pm

మ‌న్మ‌థుడు 2 మూవీ త‌ర్వాత కింగ్ నాగార్జున న‌టించిన చిత్రం వైల్డ్ డాగ్. హైద‌రాబాద్‌లో జ‌రిగిన బాంబు దాడి ఘ‌ట‌న‌ను ఆధారంగా చేసుకొని ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు అహిషోర్‌ సాల్మన్ . ఇందులో సయామీఖేర్‌, అలిరేజా తదిత‌రులు న‌టించ‌గా, నిరంజన్‌రెడ్డి, అన్వేష్‌రెడ్డి సంయుక్తంగా చిత్రాన్ని నిర్మించారు. సోమవారం నాడు హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నాగార్జున మాట్లాడుతూ, ఈ చిత్రాన్ని ఏప్రిల్ 2న రిలీజ్ చేయ‌నున్నారు. నవంబ‌ర్ లో మూవీ షూటింగ్ కంప్లీట్ అయింది. వైల్డ్ డాగ్ కెప్టెన్‌గా నేను క‌నిపిస్తా, ఈ చిత్రం ప్ర‌తి ఒక్క‌రిని బాగా అల‌రిస్తుంద‌ని నాగ్ అన్నారు.

ఎన్‌ఐఏ టీమ్‌ ఆపరేషన్‌ నేపథ్యంలో రియలిస్టిక్‌గా వైల్డ్ డాగ్ చిత్రం రూపొందగా, ఈ చిత్రం తెలుగు చిత్ర సీమలో సరికొత్త ప్రయోగంగా నిలుస్తుంది. ఉరి మూవీ తరహాలో దేశభక్తి ప్రధానంగా సాగుతుంది అని సినీ నిర్మాత అన్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 4న థియేట‌ర్ లో విడుద‌ల చేస్తున్నారు. నాగార్జున తాజాగా త‌న ట్విట్ట‌ర్ ద్వారా వైల్డ్ డాగ్ చిత్ర రిలీజ్‌కు టైం వచ్చిందంటూ ఓ పోస్ట‌ర్ విడుదల చేశారు. ఇందులో నాగ్ స్ట‌న్నింగ్ లుక్ లో కనిపిస్తున్నారు. ఈ పిక్ సోషమీడియాలో ఫుల్ వైర‌ల్‌గా మారింది.

వైర‌ల్‌ అవుతున్న నాగార్జున‌ స్ట‌న్నింగ్ పిక్..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts