రెమ్యూనరేషన్ పెంచేసిన నాచురల్ స్టార్..!?

March 8, 2021 at 2:46 pm

టాలీవుడ్ హీరోల్లో 40 కోట్ల మార్కెట్ ఉన్న హీరోగా నాని తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్నారు.హిట్టూ ఫ్లాపులకు అతీతంగా వరుస చిత్రాల్లో నటిస్తున్న నాని నుంచి ఈ ఏడాది రెండు చిత్రాలు రిలీజ్ కానున్నాయి. తాజాగా నాని హీరోగా నటిస్తున్న టక్ జగదీష్ చిత్రం ఏప్రిల్ లో రిలీజ్ కానుండగా శ్యామ్ సింగరాయ్ చిత్రం ఈ ఏడాది సెకండాఫ్ లో విడుదల కానుంది.టక్ జగదీష్ ఫ్యామిలీ స్టోరీగా తెరకక్కనుండగా శ్యామ్ సింగరాయ్ పీరియాడిక్ స్టోరీ కావడం విశేషం. ఇంకా ఈమధ్య హీరో నాని రెమ్యునరేషన్ ను భారీగా పెంచేసినట్టు టాక్. కరోనా ముందు వరకు నాని సినిమాకు 9 కోట్ల రూపాయల నుంచి 10 కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ ఉండేది.

అయితే ప్రస్తుతం నాని నటిస్తున్న టక్ జగదీష్ మూవీ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడవడంతో నాని రెమ్యునరేషన్ ను ఏకంగా 14 కోట్ల రూపాయలకు పెంచేసినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్న వార్త. నాని రెమ్యునరేషన్ గురించి జరుగుతున్న ప్రచారంలో నిజా నిజాలు ఇంకా తెలియాల్సి ఉంది.శ్యామ్ సింగరాయ్ మూవీ కోసం నాని 14 కోట్ల రూపాయలు తీసుకుంటున్నారని సమాచారం. శ్యామ్ సింగరాయ్ డిజిటల్, శాటిలైట్ హక్కులకు భారీగా డిమాండ్ ఉన్న క్రమంలో నానికి భారీ మొత్తంలో రెమ్యునరేషన్ ఇవ్వడానికి నిర్మాత కూడా రెడీ ఉన్నట్లు తెలుస్తోంది. ట్యాక్సీవాలా సినిమా ఫేమ్ రాహుల్ సాంకృత్యాన్ టక్ జగదీష్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో నాని మూడు గెటప్స్ లో కనిపిస్తారని వినికిడి. నాని నటించిన చిత్రం వి ఫ్లాప్ కావడంతో నాని టక్ జగదీష్, శ్యామ్ సింగరాయ్ చిత్రాలతో మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి రావాలని అతని ఫ్యాన్స్ భావిస్తున్నారు.ఈ చిత్రాలు మరి బాక్స్ ఆఫీస్ వద్ద ఎలా ఆడతాయో తెలియాలంటే మరి కొన్ని నెలలు వేచి చూడాల్సిందే.

రెమ్యూనరేషన్ పెంచేసిన నాచురల్ స్టార్..!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts