ఎన్టీఆర్‌-త్రివిక్ర‌మ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన యంగ్ హీరో?

March 2, 2021 at 8:50 am

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం ద‌ర్శ‌కధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న `ఆర్ఆర్ఆర్‌` సినిమాలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం త‌ర్వాత ఎన్టీఆర్ మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌నున్నాడు.

ఈ ఏడాదిలోనూ ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ల‌డానికి రంగం సిద్ధ‌మ‌వుతుంది. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. అయితే ఈ సినిమాలో ఓ యంగ్ హీరో కూడా ఉండ‌నున్నాడ‌ట‌. ఆ యంగ్ హీరో ఎవ‌రో కాదు.. నవీన్ పోలిశెట్టి.

ఇండ‌స్ట్రీ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం.. సినిమాలో ఎన్టీఆర్ కి ఫ్రెండ్ క్యారెక్టర్ ఉందని.. దానికోసం యంగ్ హీరో నవీన్ పోలిశెట్టిని తీసుకోబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. కాగా, `ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ` మంచి గుర్తింపు తెచ్చుకున్న న‌వీన్ పోలిశెట్టి.. జాతి రత్నాలు సినిమాతో త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు.

ఎన్టీఆర్‌-త్రివిక్ర‌మ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన యంగ్ హీరో?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts