రాజమౌళికి కొత్త తలనొప్పి.. ఆర్‌ఆర్ఆర్’ ఓవర్‌సీస్‌ లొల్లి..!?

March 3, 2021 at 1:39 pm
rrr

పాన్‌ ఇండియా మోస్ట్‌ అవెయిటెడ్‌ మూవీ ‘ఆర్‌ఆర్ఆర్‌(రణం రౌద్రం రుధిరం)’ ఈ ఏడాది దసరా సందర్భంగా అక్టోబర్‌ 13న విడుదలకు సన్నద్ధమవుతున్న సంగతి తెలిసిందే. దాదాపు నాలుగు వందల యాబై కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాకు ఉన్న క్రేజ్ ప్ర‌కారం ప్రీ రిలీజ్ బిజినెస్ కేక పెట్టిస్తుంది. కేవ‌లం థియేట్రిక‌ల్ బిజినెస్ వ‌ర‌కే ఐదు వంద‌ల కోట్ల రూపాయ‌ల‌ను దాటించాల‌ని రాజ‌మౌళి ప్లాన్ చేసినట్లు వార్తలు వినిపించాయి.

ఇంత క్రేజ్‌ క్రియేట్‌ చేసిన ఈ సినిమాకు కొత్త తలనొప్పులు ఎదురయ్యాయట. అదేంటంటే.. ఓవర్‌సీస్‌ హక్కుల విషయం. వివరాల్లోకి వెళితే ఓవర్‌ సీస్‌ బయ్యర్‌కు, యు.ఎస్‌ డిస్ట్రిబ్యూటర్‌కు మధ్య ఓవర్‌ సీస్‌ రేట్స్‌ పరంగా గొడవలు నెలకొన్నాయంట. ఈ గొడవలు లీగల్‌ సమస్యలకు దారి తీస్తుందని కూడా టాక్‌ బలంగా వినిపిస్తోంది.అయితే ప్రస్తుతం క్లైమాక్స్‌ను పూర్తి చేసి సినిమాను దసరా సందర్భంగా అక్టోబర్‌ 13న ఎలాగైనా విడుదల చేయాలని అనుకుంటున్న రాజమౌళి అండ్‌ టీమ్‌.

ఈ సమస్యను పెద్దది కానివ్వకుండా చర్యలు తీసుకుంటుందని అంటున్నాయి ట్రేడ్‌ వర్గాలు. బాహుబలి వంటి సెన్సేషనల్‌ పాన్‌ ఇండియా బ్లాక్‌బస్టర్‌ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం కావడంతో సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన రామరాజు ఫర్‌ భీమ్‌, భీమ్‌ ఫర్‌ రామరాజు టీజర్స్‌ సహా టైటిల్‌ లోగో మోషన్‌ పోస్టర్‌లకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్సాన్స్‌ వస్తుంది.

ఇక ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమా తెర‌కెక్కుతోంది. ఇప్పుడు సినిమా క్లైమాక్స్ చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుంది. ద‌స‌రా సంద‌ర్భంగా ఈ చిత్రాన్ని అక్టోబ‌ర్ 13న విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేశారు. ఎన్టీఆర్‌, చరణ్‌లతో పాటు అజయ్ దేవగణ్‌, ఆలియా భట్‌, రే స్టీవెన్‌ సన్, అలిసన్‌ డూడి, సముద్రఖని తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు.

రాజమౌళికి కొత్త తలనొప్పి.. ఆర్‌ఆర్ఆర్’ ఓవర్‌సీస్‌ లొల్లి..!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts