పీఎఫ్ వినియోగదారులకు షాకింగ్ న్యూస్…!?

March 1, 2021 at 3:48 pm

పీఎఫ్ వినియోగదారులకు ఒక్క షాకింగ్ న్యూస్. మన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2021లో కొన్ని కీలక ప్రకటనలు చేశారు. ప్రావిడెంట్ ఫండ్‌కు సంవత్సరం రూ.2.5 లక్షలకు పైన చేసే కంట్రిబ్యూషన్ ద్వారా లభించే వడ్డీ మొత్తం పై పన్ను పడుతుందని ఆమె వెల్లడించారు. రూ.2.5 లక్షల వరకు డిపాజిట్ మొత్తం పై వచ్చే వడ్డీ మొత్తానికి ఎలాంటి పన్ను చెల్లించాల్సిన పని లేదు. పీఎఫ్ అకౌంట్‌కు ఉద్యోగి బేసిక్ జీతం నుంచి 12 శాతం కట్ అవుతుంది. అలాగే ఇదే మొత్తానికి సమానమైన మొత్తాన్ని కంపెనీ కూడా ఉద్యోగి పీఎఫ్ ఖాతాకు జమ చేస్తుంది. కేంద్ర ప్రభుత్వపు నిర్ణయం వల్ల పీఎఫ్ ఖాతాకు ఎక్కువ డబ్బును కంట్రిబ్యూట్ చేసే వారికి ప్రతికూల ప్రభావం పడుతుంది.

ఎక్కువ ఆర్జించే వారు, ఎక్కువ డబ్బు కలిగిన వారి పై ఈ ఎఫెక్ట్ పడుతుంది. ఏడాదికి రూ.20.83 లక్షలకు పైన సంపాదించే వారు వారి పీఎఫ్ కంట్రిబ్యూషన్‌ పై ట్యాక్స్ చెల్లించుకోవాల్సి రావొచ్చు. కొత్త రూల్ కేవలం ఉద్యోగి కంట్రిబ్యూషన్‌కు మాత్రమే వర్తిస్తుందని గమనించాలి అని తెలిపారు. మోదీ సర్కార్ సరి కొత్త రూల్ ఏప్రిల్ 1 నుంచి అమలులోకి తీసుకు రాముడి. ప్రస్తుతం పీఎఫ్ అకౌంట్ ద్వారా అర్జించే వడ్డీ మొత్తం పై ఎలాంటి పన్ను భారం లేదు. ఇప్పుడు పన్ను పడుతుంది. ఎక్కువ సంపాదించే వారు లేదంటే ప్రావిడెంట్ ఫండ్‌కు ఎక్కువ డబ్బును కంట్రిబ్యూట్ చేసే వారి పై ఈ కొత్త రూల్‌ వల్ల ప్రతికూల ప్రభావం పడనుంది.

పీఎఫ్ వినియోగదారులకు షాకింగ్ న్యూస్…!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts