విరాట పర్వం నుంచి ప్రత్యేక వీడియో చూసారా..!?

March 8, 2021 at 2:53 pm

ఆడవి బాట పట్టిన అనేక మంది వీరుల తల్లులకు వీరు ప్రతిరూపాలు అంటూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విరాట పర్వం చిత్రం నుంచి ప్రత్యేక వీడియో ఒక్కటి రిలీజ్ అయింది. మహా సంక్షోభమే ఓ గొప్ప శాంతికి దారి తీస్తుందని నమ్మిన విప్లవం తనది. వారి మార్గం అసామాన్యం రెడ్ సెల్యూట్ అంటూ దీనికి రానా వాయిస్ ఓవర్ ఇచ్చాడు.

సాయి పల్లవి, నందితా దాస్ , ప్రియమణి, ఈశ్వరీరావు, జరీనా వహాబ్, నివేదా పేతురాజ్ లను ఈ విడిలో చూపించారు. విరాట పర్వం చిత్రంలో రానా దగ్గుబాటి, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రాన్ని సురేష్ బాబు సమర్పణలో ఎస్ఎల్వీ సినిమాస్ పతాకం పై సుధాకర్ చెరుకూరి ఈ మూవీని నిర్మిస్తున్నారు. వచ్చే నెల 30న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు మేకర్స్.

విరాట పర్వం నుంచి ప్రత్యేక వీడియో చూసారా..!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts