
మెగా డాటర్ నిహారిక ఈ మధ్య సినిమాలపై రివ్యూలు ఇస్తోంది. ఇటీవల మాస్టర్, ఉప్పెన, జాంబీ రెడ్డి ఇలా పలు సినిమాలపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన నిహారిక తాజాగా మరో సినిమాకు రివ్యూ ఇచ్చింది. అదే `నిన్నిలా నిన్నిలా`. అశోక్ సెల్వన్ హీరోగా అని.ఐ.వి.శశి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమే `నిన్నిలా నిన్నిలా`.
ఈ చిత్రంలో నిత్యామీనన్, రీతూవర్మ హీరోయిన్లుగా నటించాడు. లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 26 జీప్లెక్స్‌లో విడుదలై.. మంచి టాక్ తెచ్చుకుంది. ఇక ఈ సినిమా నిహారికకు కూడా తెచ్చ నచ్చేసిందట. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది. జీఫ్లెక్స్లో వచ్చిన బ్యూటిఫుల్ చిత్రం నిన్నిలా నిన్నిలాను ఎవ్వరూ మిస్ అవ్వకండి. ఈ సినిమా నాకు బాగా నచ్చేసిందని నిహారిక చెప్పుకొచ్చింది.
ఈ సినిమా ఫస్ట్ నా డార్లింగ్ అశోక్ సెల్వన్ చాలా క్యూట్‌గా కనిపించాడు. దేవ్‌గా చాలా బాగా చేశాడు. అలాగే రీతూ వర్మ, నిత్యామీనన్ ఇద్దరూ అద్భుతమైన నటన కనబరిచారు. ఇక డైరెక్టర్ శశి.. దేవ్ ప్రపంచంలోకి తీసుకెళ్లి మమ్మల్ని ప్రేమలో పడేలా చేశాడని నిహారిక తెలిపింది. ఫైనల్‌గా చిత్ర యూనిట్ మొత్తానికి శుభాకాంక్షలు తెలిపింది.