ఎమ్మెల్యే బాలయ్య కు ఎదురుదెబ్బ..!?

March 4, 2021 at 2:58 pm

పంచాయతీ ఎన్నికలలో హిందూపురం నియోజకవర్గంలో అత్యధిక స్థానాలు వైసీపీ గెలవడంతో మున్సిపల్ ఎన్నికల్లో తిరిగి తమ పట్టు నిలుపుకోవడానికి బాలకృష్ణ సిద్ధం అయ్యారు.ఈ క్రమంలో ఉదయం నియోజకవర్గం లో ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు పూజలు నిర్వహించి మీడియాతో మాట్లాడిన బాలయ్య అధికార పార్టీ వైసీపీ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణకు చేదు అనుభవం ఎదురు అయింది. బాలకృష్ణ చేపట్టిన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో జనం లేక రోడ్ షో వెల వెలబోయింది. రోడ్‌‌ షోలకు ప్రజల నుంచి మంచి స్పందన లేకపోవడంతో బాలయ్య చాలా అసహనానికి గురయ్యారు. పంచాయతీ ఎన్నికల్లో కూడా ఎమ్మెల్యే బాలకృష్ణకు ఘోర పరాభవం ఎదురు అయింది. హిందూపురం నియోజకవర్గంలో ఆయనకు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. హిందూపురంలోని 38 స్థానాల్లో 30 చోట్ల వైఎస్సార్‌ సీపీ మద్దతుదారుల విజయం సాధించిన సంగతి అందరికి తెలిసిందే. రోడ్‌ షోలకు జన స్పందన లేకపోవడంతో బాలయ్య అసహనం
పాలయ్యారు.

ఎమ్మెల్యే బాలయ్య కు ఎదురుదెబ్బ..!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts