ఈ సంవత్సరం గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఇవే ..!!

March 1, 2021 at 3:03 pm

ఈ సంవత్సరం గోల్డెన్ గ్లోబ్ అవార్డుల‌ను ప్ర‌క‌టించారు. నోమాడ్‌ల్యాండ్‌, బోర్టా చిత్రాలకు టాప్ అవార్డులు ద‌క్కాయి. బెస్ట్ పిక్చ‌ర్‌, బైస్ట్ డైర‌క్ట‌ర్ అవార్డుల‌ను నోమాడ్‌ల్యాండ్ సొంతం చేసుకుంది. చోలే జావోకు ఉత్త‌మ ద‌ర్శ‌కుడు అవార్డు ద‌క్కింది. ఆదివారం రాత్రి కాలిఫోర్నియాలో గోల్డెన్ గ్లోబ్ వేడుక‌ల‌ను ఘనంగా నిర్వ‌హించారు. నోమాడ్‌ల్యాండ్‌లో హీరోయిన్ ఫ్రాన్సెస్ మెక్‌డార్మాండ్ ప్ర‌ధాన పాత్ర పోషించారు. ఇల్లు లేని ఒక మ‌హిళ, ప‌శ్చిమ అమెరికాలో ప‌ర్య‌టిస్తుంది.

ఆ క‌థ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. మ‌హిళా డైర‌క్ట‌ర్ చాలే జావో ఈ చిత్రానికి డైర‌క్ష‌న్ పనులు చేప‌ట్టారు. గోల్డెన్ గ్లోబ్ చ‌రిత్ర‌లో డైర‌క్ష‌న్ అవార్డును ఓ మ‌హిళ గెలుచుకోవ‌డం ఇది రెండ‌వ సారి. 1983లో బార్బ్రా స్ట్రీశాండ్ ఈ అవార్డును ద‌క్కించుకున్నారు. 2006లో విడుదలై విజయం సాధించిన బోర్టాకు సీక్వెల్‌గా వ‌చ్చిన బోర్టాకు బెస్ట్ మ్యూజిక‌ల్ కామిడీ కి అవార్డు ద‌క్కింది.

ఈ సంవత్సరం గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఇవే ..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts