‘పైసా పరమాత్మ’ విడుదల తేదీ ఖరారు..!

March 7, 2021 at 3:23 pm

కంటెంట్ ఉన్న సినిమాలను ఈ మధ్య తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. చిన్న మూవీస్ అయినా కంటెంట్ బాగుంటే చాలు ప్రోత్సాహం ఇవ్వటానికి ఎప్పుడు ముందుంటారు ప్రేక్షకులు. అలా నూతన కాన్సెప్ట్ తో రాబోతున్న సినిమా పైసా పరమాత్మ . సాంకేత్,సుధీర్, కృష్ణ తేజ్, జబర్దస్త్ అవినాష్, ర‌మ‌ణ‌, అనూష‌, అరోహి నాయుడు, బ‌నీష, జబర్దస్త్ దీవెన ప్రధాన పాత్రదారులు గా చేస్తున్నారు. ఈ సినిమాని ల‌క్ష్మీ సుచిత్ర క్రియేష‌న్స్ ప‌తాకం పై టి.కిర‌ణ్ కుమార్ నిర్మించారు. ఈ సినిమాకి విజయ్ కిర‌ణ్ తిరుమల దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ మూవీ మోష‌న్ పోస్ట‌ర్, ఫ‌స్ట్ ‌లుక్ పోస్ట‌ర్‌ విడుదల కాగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. నిర్మాణా అనంతరం ఉన్న ప‌నులు పూర్తి చేసుకుని మార్చి 12 న రిలీజ్ కు రెడీగా ఉంది.

ఈ సందర్భంగా నిర్మాత టి.కిర‌ణ్ కుమార్ మాట్లాడుతూ పూర్తిగా కథని ని నమ్మి చేసిన సినిమా ఇది. ఇప్పటి తరానికి ఈ చిత్రం చాలా బాగా నచ్చుతుంది. దర్శకుడు కథ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని చేశాడు. ఆయన మీద ఉన్న నమ్మకంతోనే ఈ చిత్రాన్ని కంప్లీట్ చేయగలిగాం. ఈ చిత్రానికి మొదటి నుంచి సహాయ సహకారాలు అందించిన అందరికీ మా కృతజ్ఞతలు. ముఖ్యంగా ఈ మూవీ పోస్ట‌ర్ల‌ను ఆవిష్క‌రించి మమ్మల్ని ఆశీర్వదించిన రాజ్ కందుకూరిగారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ సినిమా మార్చి 12 న విడుదల కానుంది. ప్రేక్షకులు అందరు మా చిత్రాన్ని చూసి ఆదరించండి అంటూ మూవీ నిర్మాత మీడియాతో చెప్పుకొచ్చారు.

‘పైసా పరమాత్మ’ విడుదల తేదీ ఖరారు..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts