స్టీల్ ప్లాంట్ విషయంలో పవన్ సెన్సషనల్ కామెంట్స్ ..!?

March 19, 2021 at 1:46 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడం పక్కా అని కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్తున్న సమయంలో కార్మికులు మాత్రం ఉద్యమాన్ని ఉధృతం చేస్తూ ఉన్నారు.ఇదే టైములో అధికార పార్టీ నాయకులు ఇంకా అదేవిధంగా ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతలు కూడా ఒకే వేదిక పై ఈ విషయంలో కేంద్రం తో పోరాడటానికి సిద్ధం అవుతున్నారు. ఇలాంటి సమయంలో ఈ విషయం గురించి ప్రధాని మోడీ తో చర్చిస్తాను అని చెప్పిన జనసేన పవన్ కళ్యాణ్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు.

అసలు విషయానికి వస్తే, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకమైన అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్య పై వైసిపి పార్టీ నాయకులు మాట్లాడాలని అక్కడ జరుగుతున్న ఆందోళనలు పై అసెంబ్లీలో చర్చించాలని ఆయన పేర్కొన్నారు. 22 మంది ఎంపీలు కలిగిన వైసీపీ పార్టీయే ఈ సంగతిని ఢిల్లీ లో కేంద్రంతో మాట్లాడి ఈ సమస్యను పరిష్కరించాలనిజనసేన అధ్యక్షుడు స్పష్టం చేశారు.

స్టీల్ ప్లాంట్ విషయంలో పవన్ సెన్సషనల్ కామెంట్స్ ..!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts