హిమ‌జ‌కు లేఖ‌ రాసిన ప‌వ‌న్‌..అందులో ఏముందంటే?

March 1, 2021 at 1:02 pm

బిగ్ బాస్ ఫేమ్ హిమ‌జ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ప‌లు సీరియ‌ల్స్‌లో, సినిమాల్లో న‌టించి గుర్తింపు తెచ్చుకున్న హిమ‌జ‌.. బిగ్ బాస్ షాలో పాల్గొని మ‌రింత క్రేజ్ ఏర్ప‌ర్చుకుంది. ఇక ఈ షో త‌ర్వాత సినిమాల్లో మంచి మంచి పాత్ర‌లు ద‌క్కించుకుంటూ దూసుకుపోతోంది.

ఇక ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, డైరెక్టర్ క్రిష్ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రంలో కూడా హిమ‌జ ఛాన్స్ ద‌క్కించుకుంది. ఈ విషయాన్ని తెలుపుతూ షూటింగ్ సమయంలో పవ‌న్‌ తో కలసి దిగిన ఫోటోలను షేర్ చేసి ఆనందం వ్య‌క్తం చేసింది. అయితే అలాంటి హిమ‌జ‌కు ప‌వ‌న్ తాజాగా లేఖ రాయ‌డం హాట్ టాపిక్‌గా మారింది.

ఇంత‌కీ హిమ‌జ‌కు ప‌వ‌న్ రాసిన లెట‌ర్‌లో ఏముందంటే..`హిమజ గారికి, మీకు అన్ని శుభాలు జరగాలని, వృత్తిపరంగా మీరు ఉన్నత స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నాను` అని పేర్కొంటూ పవన్‌ ఓ లేఖను హిమజకు పంపించారు. ఈ లేఖను హిమజ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ.. `నా ఆనందాన్ని మాటల్లోనూ, ఎమోజీల్లోనూ చెప్పలేకపోతున్నాన`ని పేర్కొంది.

కాగా పవన్ కళ్యాణ్ స్వయంగా హిమజకు ఓ లేఖ రాసి ఇచ్చారు. హిమజ కెరీర్ బాగుండాలని, ఆమె మంచి స్థాయికి వెళ్లాలని కోరుతూ.. తెల్ల పేపర్ పై ఓ సందేశం రాసి... సంతకం చేసి ఇచ్చారు.  పవన్ స్వహస్తాలతో తనకు బెస్ట్ విషెస్ చెబుతూ రాసిన ఆ లేఖను హిమజ అపురూపంగా భావిస్తున్నారు.

హిమ‌జ‌కు లేఖ‌ రాసిన ప‌వ‌న్‌..అందులో ఏముందంటే?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts