
హీరోయిన్ పూర్ణ ప్రధాన పాత్ర పోషిస్తున్న తాజా చిత్రం ‘బ్యాక్ డోర్’. నంది అవార్డు గ్రహీత కర్రి బాలాజీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో యువ హీరో తేజ నటించాడు. సెవెన్ హిల్స్ సతీష్ కుమార్ సమర్పణలో ఆర్కిడ్ ఫిలిం స్టూడియోస్ పతాకంపై బి.శ్రీనివాస్ రెడ్డి నిర్మిస్తున్నారు.
అయితే తాజగా ఈ సినిమా ట్రైలర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ‘బ్యాక్‌డోర్’ ఎంట్రీ వల్ల ఎదురయ్యే విచిత్ర పరిణామాల నేపథ్యంలో రూపొందుతున్న చిత్రమని ట్రైలర్ బట్టీ క్లారిటీగా తెలుస్తోంది.
అలాగే ఈ ట్రైలర్లో హీరోయిన్ పూర్ణ, తేజ మధ్య సన్నివేశాలు రొమాంటిక్ గా ఆకట్టుకొనే విధంగా ఉన్నాయి. పూర్ణ, తేజ మధ్య కెమిస్ట్రీ బాగా పండినట్టు ట్రైలర్ బట్టీ తెలుస్తోంది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, డైలాగ్స్ కూడా ఆకర్షిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది.