`జాతిరత్నాలు` కోసం రంగంలోకి దిగుతున్న ప్ర‌భాస్‌!

March 3, 2021 at 10:30 am

టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి తాజా చిత్రం `జాతిర‌త్నాలు`. అనుదీప్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలు పోషించారు. ఫ‌రియా అబ్దుల్లా హీరోయిన్‌గా న‌టిస్తోంది. స్వప్న సినిమాస్‌ పతకంపై ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ నాగ్‌ అశ్విన్‌ నిర్మిస్తుండ‌డం విశేషం.

మహాశివరాత్రి కానుక‌గా మార్చి 11న విడుద‌ల కానున్న ఈ చిత్రంపై ఇప్ప‌టికే భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాపై మ‌రింత బ‌జ్ ఏర్పాటు చేసేందుకు యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ రంగంలోకి దిగుతున్నారు. తాజా స‌మాచారం ప్రకారం.. ఈ సినిమా ట్రైల‌ర్‌ను ప్ర‌భాస్ విడుద‌ల చేయ‌నున్నారు.

ఈ విషయం కూడా స్వయంగా నాగ్ అశ్విన్ ప్రకటించాడు. మార్చి 4 సాయంత్రం 4గంటల 20 నిమిషాలకు ఈ ట్రైలర్‌ విడుదల చేయబోతోన్నట్లుగా ఓ పోస్టర్‌ను ద్వారా ప్ర‌క‌టించారు. అలాగే హీరో నవీన్ పోలిశెట్టి ట్రైలర్ అప్డేట్ పైన ఒక వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

`జాతిరత్నాలు` కోసం రంగంలోకి దిగుతున్న ప్ర‌భాస్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts