
హీరో విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ టీపీలవుడ్ కి దొరసాని అనే మూవీతో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో రాజశేఖర్ కుమార్తె శివాత్మిక హీరోయినిగా నటించింది. ఈ మూవీ ఎదో అంతంత మాత్రంగా టాక్ పొందింది. ఇక రెండో చిత్రం మిడిల్ క్లాస్ మెలోడీస్ అనే మూవీ చేశాడు ఆనంద్ దేవరకొండ. లాక్ డౌన్ వలన ఓటీటీలో రిలీజ్ అయిన ఈ చిత్రం పెద్ద విజయం సాధించడంతో పాటు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించింది.
ఇప్పుడు ఆనంద్ దేవరకొండ చిత్రం ఫస్ట్ లుక్తో పాటు టైటిల్ కూడా రివీల్ చేశారు. విజయ్ దేవరకొండ తన తమ్ముడి మూడో చియారం ఫస్ట్ లుక్ పోస్టర్ తన సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేస్తూ మూవీ బృందానికి విషెస్ అందించారు. పుష్పక విమానం అనే టైటిల్ని ఆనంద్ దేవరకొండ మూడో సినిమాకి ఖరారు చేసినట్టు పోస్టర్ ద్వారా ప్రకటించారు.దామోదర అనే కొత్త దర్శకుడు ఈ చిత్రంతో పరిచయం కానుండగా, ఇందులో శాన్వి మేఘన, గీత సైనీ కథానాయికలుగా నటిస్తున్నారు.