రైళ్ల‌లో పొగ‌తాగితే అంతే.. కేంద్రం కీల‌క ప్ర‌క‌ట‌న‌..!

March 21, 2021 at 12:53 pm

పొగతాడం ఆరోగ్యానికి హానికరం. అనే విషయం ప్ర‌తి సినిమాలోనే కాదు సిగ‌రెట్‌, పొగాకు ఉత్ప‌త్తుల‌పైనా పెద్ద పెద్ద చిత్రాల‌తో తెలిపినా ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు. పొగాకు వ‌ల్ల వాటిల్లే అన‌ర్థాలు పెరిగిపోతున్న లెక్క‌చేయ‌డం లేదు. పొగరాయుళ్లు మాత్రం ధూమపానాన్ని ఆపడం లేదు. విచ్చ‌ల‌విడిగా ఎక్క‌డ ప‌డితే అక్క‌డ‌, క‌నీసం ప‌బ్లిక్ ప్లేస్ అని కూడా చూడ‌కుండా పొగ‌తాగుతూ జ‌నం మీద‌కు వ‌దులుతు వారి ప్రాణాల‌ను కూడా బ‌లిపెడుతున్నారు. ప్రభుత్వాలు, స్వచ్ఛంధ సంస్థలు ఎంత చెప్పినా పొగతాగడం మాత్రం త‌మ ప‌ద్ధ‌తిని మార్చుకోవ‌డం లేదు. సిగరెట్ల ద్వారా వచ్చే పొగ వల్ల కొంతమేర ప్రమాదం ఉంటే. ఆర్పకుండా సిగరెట్లు పాడేయడం ద్వారా కూడా ప్రమాదాలు జరుగుతుంటాయి.

ఇదిలా ఉండ‌గా.. భారతీయ రైల్వే శాఖ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. కఠిన చర్యలు పాటిస్తే తప్ప ఇలాంటి ప్రమాదాలకు చెక్‌ పెట్టలేమని భావించింది రైల్వే శాఖ.. ఇకపై రైళ్లలో ఎవరైనా సిగరేట్‌ తాగి దొరికితే భారీ మొత్తంలో జరిమానాతో పాటు అరెస్ట్‌ కూడా చేస్తామని తెలిపింది. రైళ్లలో ధూమపానం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జోనల్‌ జనరల్‌ మేనేజర్లు, రైల్వే బోర్డు సభ్యులను కేంద్ర రైల్వే శాఖ మంత్రి పియూష్‌ గోయల్‌ ఆదేశించారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం చట్టంలోని సెక్షన్‌ 167 ప్రకారం.. రైళ్లలో ధూమపానం చేసిన ప్రయాణికులకు రైల్వే అధికారులు రూ. 100 జరిమానాగా విధించ‌నుండ‌గా ఆ జ‌రిమానాను భారీగా పెంచాల‌ని నిర్ణ‌యించింది. అస‌లు ఉన్న‌ట్లుండి రైల్వేశాఖ ఎందుకీ నిర్ణ‌యం తీసుకోవ‌డానికి బ‌ల‌మైన కార‌ణ‌మే ఉన్న‌ది మ‌రి. ఆర్పేయని సిగరేట్‌ ఇతర వస్తువులకు అంటుకోవడం ద్వారా అగ్నిప్రమాదాలు జరగుతుంటాయి. ఇటీవల న్యూఢిల్లీ-డెహ్రాడూన్‌ శతాబ్ధి ఎక్స్‌ప్రెస్‌లో అలానే అగ్ని ప్రమాదం వాటిల్లింద‌ని విచారణలో తేలింది. ట్రైన్‌ బోగీలో ప్రయాణికుడు సిగరేట్‌ తాగి.. టాయిలెట్‌లో వేయ‌గా, అది కాస్త టిష్యూ పేపర్‌కు అంటుకుని,త‌ద్వారా పెను ద్ద ప్రమాదం చోటుచేసుకుందని ప్రాథమిక దర్యాప్తులో నిర్ధారించారు. ఈ నేప‌త్యంలో మరోసారి ఇలాంటి ప్రమాదాలు జరగకూడదనే ఉద్దేశంతో రైల్వేశాఖ క‌ఠిన చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించింది.

రైళ్ల‌లో పొగ‌తాగితే అంతే.. కేంద్రం కీల‌క ప్ర‌క‌ట‌న‌..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts