రంగ్‌దే సినిమా రివ్యూ..!

March 26, 2021 at 2:00 pm

హీరో నితిన్ తాజాగా తొలి ప్రేమఫేమ్‌ వెంకీ అట్లూరితో కలిసి రంగ్‌ దే మూవీ చేశాడు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు, టీజర్లు కూడా చిత్రం పై భారీ హైప్‌ క్రియేట్‌ చేశాయి. మరి ఆ అంచనాలను రంగ్‌దే చిత్రం ‌ అందుకుందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం. నితిన్‌ కెరీర్‌లో 29వ సినిమాగా వచ్చిన రంగ్‌దే మూవీని ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం.

అర్జున్, అను అంటే నితిన్, కీర్తి సురేశ్ బాల్య స్నేహితులు. పక్క పక్క ఇంట్లో ఉంటారు. ఇద్దరు కలిసి చదువుకుంటారు. అన్నింటిలో తనకంటే ఎక్కువ యాక్టివ్ గా ఉండే అను అంటే అర్జున్ కు ఈర్ష్య. ఆమెకు మాత్రం అర్జున్ అంటే ఇష్టం.అనుకోని విధంగా వీళ్ళిద్దరికీ వివాహం జరుగుతుంది. ఇష్టంలేకుండా తన మెడలో తాళికట్టిన అర్జున్ మనసును ఆమె ఎలా గెలుచుకుంది, అను పై అపార్థాలు తొలగి అర్జున్ ఆమెకు తన హృదయంలో ఎలాంటి చోటు ఇస్తాడో అనేది మిగతా కథ. సినిమా చూస్తున్నంతసేపు బోర్ కొట్టకుండా బాగానే ఉంటుంది కానీ ఆ తర్వాత ఆలోచిస్తే, చెప్పుకో దగ్గ అంశాలేవీ పెద్దగా లేవు అనిపిస్తుంది. కానీ మూవీ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. దర్శకుడు వెంకీ అట్లూరి రాసిన మాటలు, శ్రీమణి రాసిన పాటలు చాలా బాగున్నాయి. దేవిశ్రీ ఇచ్చిన నేపథ్య సంగీతం కూడా బాగా ఆకట్టుకుంది. తాజాగా బెస్ట్ ఎడిటర్ గా జాతీయ స్థాయిలో అవార్డుకు ఎంపికైన నవీన్ నూలి ఈ మూవీకి పని చేశాడు. యాక్షన్ సన్నివేశాల పిక్చరైజేషన్ చాలా స్టైలిష్ గా ఉంది. ఓవర్ ఆల్ గా చూస్తే, చిత్రం పై భారీ అంచనాలు పెట్టుకోకుండా, రొమాంటిక్ ఎంటర్ టైనర్ ను చూసి కాస్త ఎంజాయ్ చేయొచ్చు.

రంగ్‌దే సినిమా రివ్యూ..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts