మాజీ రంజీ క్రికెటర్ అరెస్ట్..ఎందుకంటే..!?

March 6, 2021 at 2:29 pm

మాజీ రంజీ క్రికెట్ ప్లేయర్ నాగరాజును తాజాగా హైదరాబాద్ నార్త్ జోన్ టాస్క్‌ఫోర్స్ టీమ్ అరెస్టు చేసింది. మంత్రి కేటీఆర్ పీఏనంటూ నాగరాజు పలు మోసాలకు పాల్పడినట్లు పోలీసులు చెప్పారు. పలువురు వ్యాపారవేత్తలతో పాటు హాస్పిటల్ మేనేజ్‌మెంట్‌లను లక్షల రూపాయలకు నాగరాజు మోసం చేశాడు. నాగరాజును అరెస్టు చేసిన పోలీసులు అతని దగ్గర నుండి పది లక్షల రూపాయల నగదు, పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇదివరకు గతంలో కూడా పోలీసులు నాగరాజును అరెస్టు చేశారు.

గత సంవత్సరం ఫిబ్రవరిలో కేటీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారంటూ నాగరాజు మోసాలకు పాల్పడ్డాడు. దాదాపుగా తొమ్మిది కార్పోరేట్ కంపెనీలను నాగరాజు మోసం చేశాడు. బంజారాహిల్స్, ఓయు, సనత్‌నగర్‌, మాదాపూర్, బాచుపల్లి, కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లతో పాటు విశాఖపట్నం, నెల్లూరు, మాచవరం, గుంటూరులలోనూ తన పై కేసులు నమోదు అయ్యాయి. నాగరాజు పై పీడీ యాక్ట్ కూడా నమోదు అయ్యింది. ఇంటర్ స్టేట్ క్రిమినల్‌ అయిన నాగారజు క్రికెట్ కిట్‌లను ఫ్రీగా ఇస్తామంటూ డబ్బులు వసూలు చేసినట్లు సమాచారం.

మాజీ రంజీ క్రికెటర్ అరెస్ట్..ఎందుకంటే..!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts