
బాలీవుడ్లో కొత్త మిషన్‌ను స్టార్ట్ చేసింది లక్కీ గర్ల్ గా పేరు తెచ్చుకున్న ప్రముఖ నటి రష్మికా మందన్నా. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా శంతను బాగ్చీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హిందీ చిత్రం మిషన్ మజ్నులో రష్మిక నటిస్తుంది. 1971 నాటి బ్యాక్‌డ్రాప్‌లో స్పై థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో రా ఏజెంట్‌గా కనిపిస్తారు సిద్ధార్థ్ మల్హోత్రా.
తాజాగా ఈ మూవీ షూటింగ్లో జాయిన్ అయింది రష్మికా మందన్నా. ఈ చిత్రంలో నటించడం చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది , మంచి కంటెంట్ ఉన్న మూవీలో నటిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది అంటూ రష్మికా మందన్నా చెప్పుకొచ్చింది. తెలుగులో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప, శర్వానంద్ నటిస్తున్న ఆడాళ్ళూ మీకు జోహార్లు చిత్రాల్లో రష్మిక నటిస్తుంది. తమిళంలో రష్మిక నటించిన సుల్తాన్ చిత్రం రిలీజ్ కి సిద్ధం గా ఉంది.