`పుష్ప‌`లో మొద‌ట అనుకున్న‌ది రష్మికను కాద‌ట‌..మ‌రెవ‌రంటే?

March 8, 2021 at 12:57 pm

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రం `పుష్ప‌`. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తోంది. 13 ఆగస్టు 2021న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోన్న ఈ చిత్రం షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది.

ఐదు భాషల్లో రూపొందుతున్న ఈ పాన్‌ ఇండియా చిత్రంలో బన్నీ పాత్ర రఫ్‌గా ఉండబోతుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో హీరోయిన్‌కు సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. వాస్త‌వానికి ఈ సినిమాలో మొద‌ట ర‌ష్మిక‌ను అనుకోలేద‌ట‌. ఈ విష‌యాన్ని స్వ‌యంగా సుకుమార్‌నే తెలిపారు.

ఇటీవ‌ల జ‌రిగిన `ప్లే బ్యాక్` మూవీ మీటింగ్‌లో సుకుమార్ మాట్లాడుతూ..తాను ఇప్పుడు చేస్తున్న `పుష్ప` కి కూడా ఒక తెలుగు హీరోయిన్ నే తీసుకుందాం అనుకున్నానని కానీ కుదరకపోవడంతో రష్మికాను తీసుకున్నామని తెలిపారు. అయితే తన నెక్స్ట్ ప్రాజెక్ట్ లో డెఫినెట్ గా ఓ తెలుగు హీరోయిన్ తోనే చేస్తానని సుక్కు పేర్కొన్నారు.

`పుష్ప‌`లో మొద‌ట అనుకున్న‌ది రష్మికను కాద‌ట‌..మ‌రెవ‌రంటే?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts