రవిబాబు దర్శకత్వంలో దగ్గుబాటి అభిరామ్…!?

March 3, 2021 at 11:19 am

దగ్గుపాటి సురేష్ బాబు చిన్న వారసుడు అభిరామ్ హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నట్లు గతకోన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ హీరో ఎంట్రీకి సరైన దర్శకుడి కోసం వెతుకున్నాడట నిర్మాత సురేష్ బాబు. అయితే ప్రముఖ డైరెక్టర్ వంశీ దగ్గుపాటి వారసుడి లాంచింగ్ చేయబోతున్నట్లుగా గతంలో వార్తలు వచ్చాయి. కానీ ఆ విషయం గురించి ఎలాంటి క్లారిటీ రాలేదు. తాజాగా మరోసారి అభిరామ్ మూవీ ఎంట్రీ గురించి వార్తలు వస్తున్నాయి.

తాజా సమాచారం ప్రకారం.. విభిన్న సినిమాలతో డైరెక్టర్‏గా గుర్తింపు తెచ్చుకున్న రవిబాబు.. అభిరామ్ హీరోగా మూవీ తెరకెక్కించబోతున్నాడట. ఇప్పటికే అందుకు సంబంధించిన స్టోరీ కూడా ప్రిపేర్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక దగ్గుపాటి అభిరామ్ హీరోగా.. రవిబాబు తెరకెక్కించబోతున్న సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించబోతున్నట్లుగా సమాచారం. విషయం ఎంటో గానీ ప్రతిసారి దగ్గుపాటి అభిరామ్ ఇండస్ట్రీ ఎంట్రీకి అడ్డంగులు మాత్రం బాగానే వస్తున్నాయి. అభిరామ్ సినిమా పరంగా కాకుండా వివాదాలతోనే గతంలో వార్తల్లోకెక్కిన విషయం తెలిసిందే.

రవిబాబు దర్శకత్వంలో దగ్గుబాటి అభిరామ్…!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts