ప్రమాదవశాత్తు షూటింగ్‌లో క‌న్నడ నటుడు కి గాయాలు.!!

March 2, 2021 at 2:51 pm

ఈ మ‌ధ్య కాలంలో నటి నటులు షూటింగ్ టైంలో గాయ‌ప‌డ‌డం చాలా వింటున్నాం ఇంకా చూస్తున్నాం. ఒక‌ప్పుడు రిస్కీ స్టంట్స్‌ని డూప్స్ పెట్టి చేసేవారు. కానీ ఇప్పుడు అలా కాదు, హీరోలే స్వ‌యంగా రంగంలోకి దిగి చేసేస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని సార్లు ప్ర‌మాదాల బారిన ప‌డుతున్నారు హీరోస్. తాజాగా క‌న్నడ నటుడు రిషబ్‌ శెట్టి పెట్రోల్ బాంబ్ ప్ర‌మాదంలో గాయ‌ ప‌డ్డాడు.

అసలు వివ‌రాల‌లోకి వెళితే రిష‌బ్ శెట్టి ప్ర‌ధాన పాత్ర‌లో హీరో అనే చిత్రం తెరకెక్కుతుంది. ఈ చిత్రం పోరాట దృశ్యాల‌ను హాస‌న్ జిల్లా బేలూరులో చిత్రీక‌రిస్తున్నారు. అయితే మూవీ షూటింగ్ స‌మ‌యంలో రిష‌బ్, గానావి ల‌క్ష్య‌ణ్ పెట్రోల్ బాంబ్ విసిరి పారీ పోతున్న టైములో వారికి మంట‌లు అంటుకున్నాయి. వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన సినిమా బృందం ఇంకా సిబ్బంది మంట‌ల‌ను ఆర్పి ప్ర‌థ‌మ చికిత్స చేశారు. ఆ త‌ర్వాత ఆయన్ని దగ్గరలో ఉన్న ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఇద్ద‌రికి పెద్ద ప్ర‌మాదం ఏమి లేద‌ని వైద్యులు చెప్పటంతో ఊపిరి పీల్చుకున్నారు అంతా.

ప్రమాదవశాత్తు షూటింగ్‌లో క‌న్నడ నటుడు కి గాయాలు.!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts