‘ఆ’ ట్వీట్‌. ఖరీదు రూ. 18.30 కోట్లు…!?

March 7, 2021 at 3:37 pm

జస్ట్ సెట్టింగ్ అప్ మై ట్విట్టర్ అంటూ 2006 సంవత్సరం మార్చి 21 న ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సీ చేసిన మూట మొదటి ట్వీట్‌‌కు భారీ ధర పలికింది. ఈ ట్వీట్ ను అమ్మకానికి పెట్టారు. దీనిని జాక్ డోర్సీ వాల్యుయబుల్స్ బై సెంట్ అనే వెబ్‌ సైట్‌లో అమ్మకానికి పెట్టారు. ఈ సంగతిని ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. ఈ ట్వీట్ కొనుగోలుకు లక్షల మంది ఆసక్తి చూపించటం విశేషం.

ఈ ట్వీట్ కి బిడ్స్ కూడా భారీ సంఖ్యలో దాఖలయ్యాయి. అత్యధికంగా 2.5 మిలియన్ డాలర్లు ఇచ్చేందుకు కొంతమంది ఔత్సాహికులు ముందుకు రావడం గమనార్హం. అంటే మన కరెన్సీలో ఇది రూ. 18.30 కోట్లు అనమాట. ఈ ట్వీట్‌ను కొనుగోలు చేసిన వారికి ట్విటర్ సీఈవో డిజిటల్‌గా వెరిఫై చేసి, సంతకం చేసిన ఓ ధ్రువపత్రాన్ని ఇస్తారు. ఆ పత్రంలో ట్వీట్‌తో పాటు దానిని పోస్ట్ చేసిన టైం ఇతర వివరాలు ఉంటాయి. ఈ ట్వీట్‌కు ఎంతో మంది లక్షల రూపాయలు చెల్లించి కొనేందుకు ఉత్సాహం చూపుతున్నారు.

‘ఆ’ ట్వీట్‌. ఖరీదు రూ. 18.30 కోట్లు…!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts