హిందీ ఆర్ఎక్స్100 మూవీ ఫస్ట్‌లుక్..!!

March 2, 2021 at 1:26 pm

టాలీవుడ్ లో ఆర్ఎక్స్100 ఈ పేరు తెలియని వారు ఉండరు. 2018లో సంచలనాలు సృష్టించిన ఈ చిత్రంతో హీరో కార్తికేయ, హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌కి భారీ క్రేజ్ వచ్చింది. ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అయ్యాక ఇతర భాషల ప్రేక్షకులని కూడా బాగా ఆకట్టుకుంది. అయితే తాజాగా ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసేందుకు నిర్ణయించుకున్నారు. ఈ చిత్రానికి హిందీలో తడప్ అనే టైటిల్ ని ఖరారు చేశారు. ఇందులో బాలీవుడ్ అగ్ర హీరో సునీల్ శెట్టి తనయుడు అహాన్ శెట్టి హీరోగా నటిస్తున్నారు.

తారా సుటారియా హీరోయిన్ పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ను బాలీవుడ్ అగ్రహీరో అక్షయ్ కుమార్ విడుదల చేశారు. ఇందులో హీరో, హీరోయిన్‌లు కౌగిలించుకొని కనిపిస్తున్నారు. ఈ చిత్రాన్ని మిలన్ లూథ్రియా డైరెక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్24న రిలీజ్ చేయాలని మూవీ యూనిట్ ప్లాన్ చేస్తోంది. మరి ఈ సినిమా హిందీలో కూడా ఆ స్థాయిలో సంచలనాలు సృష్టిస్తుందేమో ఎదురు చూడాల్సిందే.

హిందీ ఆర్ఎక్స్100 మూవీ ఫస్ట్‌లుక్..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts