
హీరో సాయి ధరమ్ తేజ్ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటాడు. ప్రతి సందర్భాన్ని పురస్కరించుకొని ఆయన సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ ఉంటారు. ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తన తల్లితో దిగిన క్యూట్ ఫోటో ని షేర్ చేస్తూ, అమ్మా లవ్ యూ, హ్యాపీ ఉమెన్స్ డే అంటూ కామెంట్ కూడా పెట్టాడు. ఈ పిక్ మెగా అభిమానులనే కాక నెటిజన్స్ అందరికి తెగ నచ్చేసింది.
కొడుకు పుట్టినప్పుడు కంటే, వారు పెరిగి ప్రయోజకులు అయినప్పుడు ఆ తల్లిదండ్రులకు నిజమయిన సంతోషం. చిరంజీవి సోదరి, సాయి ధరమ్ తేజ్- వైష్ణవ్ తేజ్‌ల తల్లి అయిన లక్ష్మీ దుర్గా తన ఇద్దరు కుమారుల ప్రగతిని చూసి తెగ సంతోష పడ్తున్నారు. తన ఇద్దరు కుమారుల ఎదుగుదలని చూసి వాళ్ళ తల్లి లక్ష్మీ దుర్గా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.