సైనా నెహ్వాల్ బయోపిక్ విడుదల తేదీ ఖరారు..!!

March 2, 2021 at 2:15 pm

ప్రస్తుతం భారత సినీ పరిశ్రమలో బయోపిక్‌ల హవా నడుస్తోంది. ప్రముఖుల జీవిత చరిత్రలను మూవీస్ రూపంలో అందరికీ తెలిసేలా చేస్తున్నారు. దర్శకులు వారి చిత్రాలతో ఎందరికో స్ఫూర్తిని ఇస్తున్నారు. అందులో భాగంగా రూపొందిన చిత్రాల్లో ఇప్పటికి కొన్ని చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి ఆదరణ పొందాయి. మరికొన్ని విడుదలకు రెడీ అవుతున్నాయి.

వాటిలో భారత బ్యాడ్‌మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ బయోపిక్ కూడా ఒకటి. ఇందులో బాలీవుడ్ యాక్టర్ పరిణితీ చోప్రా ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని దర్శకుడు అమోల్ గుప్త దర్శకత్వంలో భూషన్ కుమార్, కృష్ణన్ కుమార్, సుజయ్ జై రాజ్, రాషేష్ షా సంయుక్తంగా నిర్మించారు. నేడు ఈ మూవీ ప్రీ లుక్ పోస్టర్ సహా రిలీజ్‌ డేట్‌ను కూడా మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రాన్ని మార్చి26న రిలీజ్ చేయనునట్లు తెలిపారు మేకర్స్.

సైనా నెహ్వాల్ బయోపిక్ విడుదల తేదీ ఖరారు..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts