
అక్కినేని వారి కోడల సమంత ప్రస్తుతం `శాకుంతలం` చిత్రంలో నటించనున్న సంగతి తెలిసిందే. గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో తెరకెక్కించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మహాభారతంలోని ఆదిపర్వం నుంచి ఈ కథను తీసుకున్నాడు.
పౌరాణిక నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో శకుంతల, దుష్యంతుల ప్రేమకథను తెరపై చూపించనున్నారు. అయితే శకుంతలగా సమంత కనిపించనుండగా..దుష్యంతుడుగా ఎవరు నటిస్తారనే చర్చ ఎప్పటి నుంచి నడుస్తోంది. అయితే తాజాగా సమంత.. `అతనే నా అందాల రాకుమారుడు` అంటూ దుష్యంతుడిని పరిచయం చేసింది.
ఇంతకీ దుష్యంతుడు ఎవరో కాదు..మలయాళ నటుడు దేవ్ మోహన్. ఈ మేరకు సమంత ఓ చిన్న వీడియోను పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. కాగా, ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని గుణ టీమ్‌వర్క్స్ బ్యానర్‌పై నీరజ్ గుణ నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.